Home » నేర‌స్థుల‌ను ఉరి తీసే ముందు ఉండే రూల్స్ ఎంటో తెలుసా?

నేర‌స్థుల‌ను ఉరి తీసే ముందు ఉండే రూల్స్ ఎంటో తెలుసా?

by Bunty
Ad

ఉరి శిక్ష అనేది క‌రుడు క‌ట్టిన నేర‌స్థుల‌కే మ‌న దేశం కోర్టు విధిస్తాయి. మ‌న దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా త‌క్కువ సంఖ్య లో ఉరి శిక్ష‌ల‌ను అమ‌లు చేశారు. నిజానికి ఉరి శిక్ష‌ను ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ కూడా మ‌న దేశంలో ఎప్పటి నుంచో వ‌స్తుంది. అయితే ప్ర‌స్తుతం ఆ డిమాండ్ ఇంకా ప‌రిశీల‌న‌లోనే ఉంది. అయితే ఉరి శిక్ష విధించిన నేరస్థుడు.. త‌న త‌ప్పు తెలుసుకుని పాశ్చ‌తాపంతో రాష్ట్రప‌తి కి క్ష‌మాభిక్ష పెట్టుకుంటే రాష్ట్రప‌తి విచ‌క్షణ అధికారాల‌తో ఉరిశిక్ష ను యవాజ్జీవ, జీవిత ఖైదు శిక్ష గా మారుస్తారు. అయితే ఈ నిర్ణ‌యం అనేది పూర్తి గా రాష్ట్రప‌తి విచ‌క్ష‌ణ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే మ‌న దేశం లో ఉరి శిక్ష అమ‌లు చేసిన త‌ర్వాత ఉరిశిక్ష వేసే స‌మ‌యంలో కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

Advertisement

Advertisement

ఉరి శిక్ష విధించే రోజు నేర‌స్థుల‌ను ఉద‌యం 3 గంట‌ల‌కు నిద్ర లేపి అన్ని కార్యక్ర‌మాలు ముగించాలి. అలాగే ఆ నేర‌స్థుల‌కు ఇష్టం వ‌చ్చిన ఆహారాన్ని ముందు రోజే క‌నుక్కుని ఆ ఆహారం వ‌డ్డించాలి. త‌ర్వాత దైవ భ‌క్తి ఉన్న వారికి దేవుడి కి సంబంధించిన పుస్త‌రాలు ఇస్తారు. అలాగే వారిని కొంత స‌మ‌యం ఒంట‌రి గా వ‌దిలేస్తారు. అనంత‌రం నిందితుడు పూర్తి ఆరోగ్యం గా ఉన్నాడా అని ప్రత్యేక‌మైన డాక్ట‌ర్ల‌తో చెక్ చేస్తారు. అనంత‌రం ఆ నిందితుడు చేసిన త‌ప్పులు, దానికి గ‌ల శిక్ష‌ల గురించి పూర్తి గా వివ‌రించాల్సి ఉంటుంది. అనంత‌రం ఆ నిందితున్ని ఉరి తీస్తారు.

అయితే ఈ ఉరి అనేది తెల్ల వారు జామున 4 గంట‌ల లోపే ఉండాలి. 4 గంట‌ల త‌ర్వాత ఉరి తీయ‌డానికి అనుమ‌తి ఉండ‌దు. దీనికి కార‌ణం ఉద‌యం అంతా ప్ర‌శాంతం గా ఉంటుంద‌ని, ఆ స‌మ‌యంలో అంద‌రూ కూడా నిద్ర లో ఉంటార‌ని ఉద‌యం 4 గంట‌ల‌కు ఉరి తీస్తారు. ఉరి తీసిన అనంత‌రం ఆ త‌లారి వివ‌రాల‌ను బ‌య‌టకు వెల్ల‌డించ‌రు. అత‌ని వివ‌రాల‌ను గోప్యం గా ఉంచుతారు. అలాగే ఉరి అనంతరం మ‌ర‌ణించిన నిందితుని మృత దేహాన్ని అతని కుటుంబ స‌భ్యుల‌కు అందిస్తారు.

Visitors Are Also Reading