థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్ గా పృథ్వీరాజ్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా సినిమాల్లో స్పూఫ్ లు చేస్తూ థియేటర్ లలో నవ్వులు పూయించారు. లౌక్యం, గబ్బర్ సింగ్ ఇలా చాలా సినిమాల్లో పృథ్వీరాజ్ నటించి ప్రేక్షకులను నవ్వించారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో పృథ్వీరాజ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినీ జీవితాన్ని నాశనం చేసుకున్నారు.
Advertisement
ఎన్నికల ముందు వైసీపీ తరుపున ప్రచారం చేసిన పృథ్వీరాజ్ గత కొద్దిరోజులుగా వైసీపీని తిడుతూ టీడీపీ, జనసేనలను మోస్తున్నారు. అంతేకాకుండా తాను రాజకీయాల్లో గుణపాఠాలు నేర్చుకున్నానని చెబుతున్నారు. ఇదిలా ఉంటే పృథ్వీరాజ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తండ్రి బాలనేని శ్రీనివాస్ కూడా ఒకప్పటి నటుడే అన్న సంగతి పృథ్వీరాజ్ చెప్పాడు.
Advertisement
ఆయనకు దాసరి నారాయణ రావు, మోహన్ బాబులతో మంచి సంబంధాలు ఉండేవని అన్నారు. తన తండ్రి ఎన్టీరామారావుతో కలిసి శ్రీకృష్ణావతారం సినిమాలో మొదటిసారి నటించారని చెప్పారు. ఆ తరవాత చాలా సినిమాల్లో నటించాడని చెప్పారు. తనకు సినిమాలపై ఉన్న ఆసక్తితో చెన్నైకి వెళ్లిపోయానని తెలిపాడు. ఆ ఒక్కటి సినిమా ఆడిషన్స్ కు వెళ్లినప్పుడు ఈవివి సత్యనారాణ గారు రావుగోపాల్ రావు గారు ఒప్పుకుంటే మీరు సెలెక్ట్ అవుతారని చెప్పారట.
ఏవీఎం స్టూడియోలో తనను చూసిన వెంటనే రావు గోపాల్ రావు ఈ అబ్బాయేనా నా మేనల్లుడు అంటూ అడిగాడని అప్పుడే తనను రావుగోపాల్ రావు ఒప్పుకున్నట్టు అర్థం అయ్యిందని చెప్పాడు. అలా ఆ ఒక్కటి సినిమాతో తన నట ప్రస్థానం మొదలైందని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఇక వైజాగ్ తో తాను రావుగోపాల్ రావుతో ఒకే గదిలో 40 రోజులు ఉన్నానని చెప్పారు. ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.