సాధారణంగా అభిమానుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎప్పటికీ కలిసి మెలిసి ఒక కుటుంబం లాగానే ఉంటారు. కొంతమంది స్టార్స్ అయితే, సరిసమానమైన ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా సొంత అన్నదమ్ములు లాగా ఉంటారు. వాళ్లని అలా చూస్తే అభిమానుల కళ్ళ నుండి ఆనందంతో నీళ్లు కారుతాయి. అలాంటి వారిలో మనం ముందుగా అక్కినేని నాగార్జున మరియు మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుకోవాలి.
Advertisement
దశాబ్దాల నుండి వీళ్ళిద్దరి స్నేహం ఎంతో అమూల్యమైనది. చిరంజీవిని నాగార్జున తన సొంత అన్నయ్య లాగా భావిస్తాడు. ఇద్దరు స్టార్ స్టేటస్ విషయంలో తక్కువేమీ కాదు. ఇరువురి హీరోల అభిమానులకు సోషల్ మీడియాలో మరియు బయట ఎన్నో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ హీరోలు మాత్రం సొంత అన్నదమ్ములు లాగానే ఉంటారు. ఇంత మంచి స్నేహ బంధం ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అందుకు కారణాలు ఏవైనా కావొచ్చు కానీ చిరంజీవిని హీరోగా పెట్టి నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఒక సినిమా చేయ్యాలని అనుకున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడిగా కె.రాఘవేంద్ర రావు కూడా ఫిక్స్ అయ్యారు. సౌందర్య ఇందులో హీరోయిన్, రెండు పాటలు మరియు 10 శాతంకి పైగా టాకీ పార్ట్ పూర్తి చేశారు.
Advertisement
కానీ రాఘవేంద్ర రావుకి సినిమా కథ మరోసారి పరిశీలించి చూస్తే ఇది ఎందుకో చిరంజీవి ఏమేజికి తగ్గ సినిమా కాదని అనిపించిందట. కథలో ఎక్కడో ఏదో మిస్ అవుతుందని అనుకున్నాడట. ఎంత ప్రయత్నం చేసి కథని సరిచేయాలని చూసిన అది చిరంజీవి ఇమేజి వర్కౌట్ అయ్యే సబ్జెక్టు లాగా కనిపించలేదు. ఇదే విషయాన్నీ ముందుగా రాఘవేంద్ర రావు గారు నాగార్జునని పిలిచి చెప్పాడట. నమ్మకం లేకపోతే సినిమాని ఆపేద్దాం లేండి, వేరే ఏదైనా మంచి కథ ఉంటే చూద్దామని అన్నాడట నాగార్జున. మరి చిరంజీవి డేట్స్ ని ఏమి చేస్తావు, అతను మనకి నాన్ స్టాప్ గా నెల రోజులు డేట్స్ ఇచ్చాడు కదా అని నాగార్జునతో అనగా, ఆయనకి నేను నచ్చచెప్పుకుంటాను లేండి ఏమి పర్వాలేదు అని అన్నాడట నాగార్జున. చిరంజీవికి ఈ విషయం చెప్పగా, ఆయన చాలా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యాడట. కానీ నెల రోజులు డేట్స్ వేస్ట్ అయ్యాయి కదా, ఈ నెల రోజులు ఫారెన్ ట్రిప్ కి ప్లాన్ చేసుకుంటానులే అని నాగార్జునతో చెప్పాడట.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
సాయి పల్లవిని విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడా ?