Home » తారకరత్నని చివరి చూపు చూసేందుకు మోహన్ బాబు రాకపోవడానికి కారణం అదేనా..?

తారకరత్నని చివరి చూపు చూసేందుకు మోహన్ బాబు రాకపోవడానికి కారణం అదేనా..?

by Anji
Ad

నందమూరి తారకరత్న అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఈనెల 18న శివరాత్రి పండుగ రోజున తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అకస్మాత్తుగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే చిత్తూరులోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన  చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో విదేశీ వైద్యుల సమక్షంలో దాదాపు ఈయనకు 23 రోజుల పాటు చికిత్స జరిగినప్పటికీ ఆరోగ్యంతో తిరిగిరాలేక మృత్యువు ఒడిలో చేరారు. 

Advertisement

తారకరత్న మరణించారనే వార్త ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. తారకరత్న మరణ వార్త తెలియగానే సినీ పరిశ్రమ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. నందమూరి తారకరత్న మరణానికి సంతాపం ప్రకటించారు. బెంగళూరు నుంచి ఈయన పార్థివ దేహాన్ని మోకిలలోని తన సొంత ఇంటికి తీసుకెళ్లారు. ఆ తరువాత అభిమానుల సందర్శనార్థం తారకరత్న మృతదేహాన్ని ఫిలిం ఛాంబర్ కి తరలించారు. ఫిలిం ఛాంబర్ కి పెద్ద ఎత్తున సినీ సెలబ్రెటీలు తరలివచ్చి తారకరత్నకి కన్నీటి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు మోహన్ బాబు మాత్రం తారకరత్న చివరి చూపు కోసం హాజరు కాలేదు.  

Advertisement

Also Read :  ఆన్ లైన్ లో ఐఫోన్ ఆర్డర్ చేసిన యువకుడు.. డబ్బులు చెల్లించలేక ఏం చేశాడంటే..? 

సీనియర్ నటుడు మోహన్ రాకపోవడానికి గల కారణాలను  సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. తారకరత్న మరణంపై మోహన్ బాబు స్పందిస్తూ.. “ప్రస్తుతం తాను లండన్ లో, మా విష్ణు సింగపూర్ లో ఉండటం వల్ల వ్యక్తిగతంగా తారకరత్న చివరి చూపు చూసేందుకు రాలేకపోయాం. నా అన్న నందమూరి తారకరామారావు మనవడు తారకరత్న నా కుటుంబానికి, నాకు ఎంతో ఆత్మీయుడు. తారకరత్న చాలా మంచి వాడు. ఎంతో ఆత్మీయుడు, ఎంతో స్నేహశీలో చెప్పటానికి నాకు మాటలు సరిపోవడం లేదు” అంటూ మోహన్ బాబు తారకరత్న మృతి పై ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

  Also Read :  ప్రాణ స్నేహితుడు చనిపోయినా చూడటానికి వెళ్ళని రజనీకాంత్.. ఎందుకో తెలుసా?

Visitors Are Also Reading