మెగాస్టార్ చిరంజీవి అంటే 1990లలో చాలా మందికి ఒక ఇన్ స్పిరేషన్. ఇక ఇప్పటికీ కూడా ఆయన పేరు చెబితే చాలా మంది పాత సినిమాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా 1990లో చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని చాలా మంది సినిమాలలోకి వచ్చేవారు. అలా ఆయన నటించాలని, ఎదగాలని తాపత్రయ పడి సినిమాల్లోకి వచ్చిన నటులలో అచ్యుత్ ఒకరు. ఎప్పటికైనా చిరంజీవి మాదిరిగా బతకాలని అనుకున్నారు. చివరికీ ఆయనతో కలిసి ఒక సినిమాలో అయినా నటించాలని కలలు కనేవారు.
Advertisement
తొలుత బుల్లితెర ద్వారా ఎంట్రీ ఇచ్చారు అచ్యుత్. ఇక ఆ తరువాత వెండితెరపై 1991లో ప్రేమ ఎంత మధురం అనే సినిమాలో నటించారు. ఆ సినిమాకి జంధ్యాల దర్శకత్వం వహించారు. హీరోగా అవ్వాలనుకొని ఏనాడు కూడా అనుకోని అచ్యుత్.. సినీ ఇండస్ట్రీకి రాకపోయినా వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకునే వారు కాదు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటిస్తూ అందరి దఈ ష్టిని ఆకర్షించాడు. తన టైమ్ లో ఉన్న అందరి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం అచ్యుత్ కి లభించింది.
Advertisement
ఇక తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ కి అన్నయ్యగా నటించి ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచే పాత్రలో నటించాడు. సినిమాల్లో కంటే బుల్లి తెరపై హీరోగా అవకాశాలు రావడం విశేషం. కెరీర్ లో ఏకంగా 5 నంది అవార్డులు ఆయనకు దక్కాయి. ఆయన నటించిన అంతరంగాలు, అన్వేషిత వంటి సీరియల్స్ తో లేడీ ఫ్యాన్స్ ని మనసులను గెలుచుకున్నారు. ఈ సీరియల్స్ తో పాటు ఆయన టెలివిజన్ రంగంలో దాాదాపుగా 50కి పైగా సీరియల్స్ లో నటించారు. అచ్యుత్ కలల కన్నట్టుగానే మెగాస్టార్ చిరంజీవితో డాడీ సినిమాలో కలిసి నటించారు. చిరంజీవి పక్కనే ఉంటూ ఆయననే డబ్బు విషయంలో మోసం చేసే పాత్రలో అచ్యుత్ నటించాడు. సినిమాల్లో, సీరియల్స్ లో వచ్చిన డబ్బును బిజినెస్ లో పెట్టుబడి పెట్టి స్నేహితుల చేతిలో మోసపోయారు. చివరి సారిగా అచ్యుత్ మహేష్ మూవీ ఒక్కడు సినిమాలో భూమిక అన్నయ్య పాత్రలో నటించాడు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే అలవాటు ఉన్న అచ్యుత్ హార్ట్ ప్రాబ్లమ్ తో మృతి చెందాడు.