Home » టీవీ లో వ‌చ్చే యాడ్స్ కు ధ‌ర ఎంతో తెలుసా?

టీవీ లో వ‌చ్చే యాడ్స్ కు ధ‌ర ఎంతో తెలుసా?

by Bunty
Ad

మ‌నం టీవీ ల‌లో సినిమాలు చూసే క్ర‌మంలో యాడ్స్ వ‌స్తుంటాయి గ‌మ‌నించారా? ఈ ఒక దాని త‌ర్వాత మ‌రొక‌టి యాడ్స్ వ‌స్తూనే ఉంటాయి. ఇలా క‌నీసం ఒక 15 నుంచి 20 నిమిషాల‌కు వ‌ర‌కు యాడ్స్ వ‌స్తుంటాయి. అయితే ఈ యాడ్స్ కు ఆ ఛాన‌ల్ వాళ్లు ఎంత డ‌బ్బు ఇస్తారో మీకు తెలుసా? ఇప్పుడు మ‌నం యాడ్స్ ప్ర‌సారం చేయ‌డం వ‌ల్ల ఎంత డ‌బ్బు ఛాన‌ల్ వారికి వ‌స్తుందో తెలుసుకుందాం. సాద‌ర‌ణం గా టీవీ యాడ్స్ కు వ‌చ్చే ఆదాయం అనేది ఆ ఛాన‌ల్ యొక్క టీఆర్పీ రేటింగ్ పై ఆధార‌పడి ఉంటుంది. అలాగే యాడ్ చేయ‌బోయే కంపెనీ ని బ‌ట్టి కూడా టీవీ ఛాన‌ల్ కు వ‌చ్చే ఆదాయం ఉంటుంది.

Advertisement

Advertisement

అయితే టెలికాం రెగ్యులేట‌రీ ఆథారిటీ ఆఫ్ ఇండియా నిబంధ‌నల ప్ర‌కారం ప్ర‌తి గంట లో 12 నిమిషాలు మాత్ర‌మే బ్ర‌డ్ కాస్ట‌ర్ వాణిజ్య ప్ర‌మోష‌న్ల కోసం ఉప‌యోగించు కోవాలి. అయితే కొన్ని రాష్ట్రాల‌లో స్థానిక టీ వీ స్టేష‌న్ ల ద్వారా కూడా ప్ర‌క‌ట‌న లు చేస్తారు. స్థానిక టీ వీ స్టేష‌న్ ల‌లో ప్ర‌తి 30 సెక‌న్ల కు క‌నీసం రూ. ల‌క్ష నుంచి తీసుకుంటారు. అలాగే కొన్ని స్టార్ టీవీ ఛాన‌ల్స్ కేవలం 10 సెక‌న్ల యాడ్ కు క‌నీసం రూ. 3,50,000 నుంచి తీసుకుంటారు. అలాగే యాడ్ ల‌కు ధ‌ర ను నిర్ణయించ‌డం కూడా యాడ్ నిడివి ని బ‌ట్టి ధ‌ర ను నిర్ణ‌యిస్తారు.

సాధార‌ణం గా 10 సెకెన్ల కు ఒక విధం గా, 15 సెక‌న్ల యాడ్ కు ఒక ధ‌ర.. 30 సెక‌న్ల యాడ్ కు మ‌రో ధ‌ర అని ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రా ల‌లో లోక‌ల్ ఛాన‌ల్స్ ఉంటాయి. అవి కేవ‌లం కొన్ని ప్రాంతాల‌లో మాత్ర‌మే క‌నిపిస్తాయి. అలాంటి ఛాన‌ల్ వాళ్లు ప్ర‌తి 10 సెక‌న్ల యాడ్ కు రూ. 500 లేదా రూ. 1000 తీసుకుంటారు. అందులోనే కాస్త జ‌నాధార‌ణ పొందిన ఛానల్స్ రూ. 5,000 నుంచి రూ. 10,000 వ‌ర‌కు తీసుకుంటారు.

Visitors Are Also Reading