Home » విదేశాల్లో అమ్మాయిల వివాహ వ‌య‌స్సు ఎంతో తెలుసా?

విదేశాల్లో అమ్మాయిల వివాహ వ‌య‌స్సు ఎంతో తెలుసా?

by Bunty
Ad

ఇటీవ‌ల మ‌న కేంద్ర ప్ర‌భుత్వం అమ్మాయిల వివాహ వ‌య‌స్సు పై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలో అమ్మాయిల వివాహ వ‌య‌స్సు 18 ఉండేది. ఇటీవ‌ల కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం తో అమ్మాయిల వివాహ వ‌య‌స్సు 21 కి పెర‌గ‌నుంది. ఈ నిర్ణ‌యా నికి కేంద్ర మంత్రి మండ‌లి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే ప్ర‌స్తుతం న‌డుస్తున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ను ప్ర‌వేశ పెట్టె అవ‌కాశం ఉంది. ఈ బిల్లు పాస్ అయితే అమ్మాయిల వివాహ వ‌య‌స్సు 21 అవుతుంది. అయితే మ‌న దేశం ఇలా ఉంటే ఇత‌ర దేశాల‌లో అమ్మాయిల వివాహం విష‌యంలో ఎలాంటి నిబంధ‌న‌లు ఉన్నాయ‌నే చ‌ర్చ ప్ర‌స్తుతం ఎక్కువ గా వినిపిస్తుంది. ప‌లు దేశాల్లో అమ్మాయిల వివాహం ఏ వ‌య‌స్సు లో చేస్తారో మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

అయితే అమ్మాయిల వివాహ వ‌య‌స్సు ఒక్కో దేశం లో ఒక్కో విధం గా ఉంది. కొన్ని దేశాల్లో మ‌న కంటే చాలా త‌క్కువ ఉన్నాయి. మ‌రి కొన్ని దేశాల్లో మ‌రిక విధం గా ఉన్నాయి. అతి త‌క్క‌వు గా లెబ‌నాన్ అనే దేశం లో అమ్మాయిలకు 9 ఏళ్ల వ‌య‌స్సు లోనే పెళ్లీలు చేస్తారు. అలాగే దీని త‌ర్వాత ఇరాన్ లో 13 ఏళ్ల కు అమ్మాయిల‌కు వివాహం చేస్తారు. దీని త‌ర్వాత చాద్, కువైట్ దేశాల్లో 15 ఏళ్లు వివాహం చేస్తారు. దీంతో పాటు అఫ్గానిస్తాన్, పాకిస్థాన్, కతార్, యూకే దేశాల్లో అమ్మాయిల‌కు 16 ఏళ్లు వ‌స్తే వివాహం చేసుకోవ‌డానికి ప్ర‌భుత్వం అనుమ‌తి ఉంటుంది.

అలాగే అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ, బ్రెజిల్, శ్రీలంక దేశాలలో అమ్మాయిలకు 18 ఏళ్లు వ‌చ్చాకే వివాహ చేసుకోవాల‌ని నిబంధ‌న ఉంది. దీని త‌ర్వాత‌ చైనా, జపాన్, నేపాల్, థాయిలాండ్‌లో 20 ఏళ్లు వ‌చ్చాకే అమ్మాయిలు వివాహం చేసుకోవాలి. అయితే మ‌న దేశంలో కొత్త చ‌ట్టం వ‌స్తే ప్ర‌పంచం లోనే ఎక్కువ వ‌య‌స్సు ఉన్న అమ్మాయిలకు వివాహం చేయ‌డానికి అనుమ‌తి ఇచ్చిన దేశం గా ఉంటుంది.

Visitors Are Also Reading