సాధారణంగా పర్యాటకులు పలు ప్రాంతాల్ని సందర్శించడానికి వెళ్తుంటారు. అలాగే ప్రతి ఏడాది ఎక్కువ మంది టూరిస్టులు మేఘాలయకి వెళ్తారు. వారిలో 90 శాతం మంది మేఘాలయలోని నోహ్కాలికై వాటర్ ఫాల్స్ ని చూడడానికి వెళ్తుంటారు. అందుకు కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇది భారతదేశంలోనే అతి ఎత్తైన ప్లంజ్ జలపాతంగా గుర్తింపు పొందింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య దీని పరిసర ప్రాంతాలు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఆ సమయంలో ఇక్కడికి వెళ్లేందుకు పర్యాటకులు చాలా ఆసక్తి చూపిస్తారు.
Advertisement
చక్కటి ప్రకృతి మధ్య కాసేపు సమయాన్ని గడిపితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందులోనూ పచ్చని ప్రకృతి మధ్య మనం ఉంటే అసలు సమయమే తెలియదు. స్టేట్ టూరిజంని పెంపొందించడానికి ఈ వాటర్ ఫాల్ సరిపోతుంది అన్నట్లుగా చాలా అందంగా ఉంటుంది ఈ ఫాల్స్. అందుకే ఎక్కువ మంది ఈ ప్రదేశాన్ని చూడటానికి వెళుతుంటారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు ఎక్కువమంది ఉదయం, మధ్యాహ్నం సమయాలలో వెళ్తూ ఉంటారు. ఫోటోలు, వీడియోలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ జలపాతం వద్ద ఒక ఘోర సంఘటన జరిగింది. మరి ఆ భయంకర కథను తెలుసుకుందాం.
Advertisement
ఖాసీ భాషలో “కా” అనేది స్త్రీ లింగాన్ని సూచిస్తుంది. లికై అనేది ఒక స్త్రీ పేరు. స్థానిక పురాణాల ప్రకారం.. నోహ్కాలికై జలపాతానికి పైన ఓ గ్రామం ఉంది. అదే రంగ్జిర్తెహ్ గ్రామం. అక్కడ “లికై” అనే మహిళ ఉండేది. ఆమె భర్త చనిపోయాడు. ఆమె తన బిడ్డతో పాటు ఉండేది. తన బిడ్డను చూసుకోవడానికి ఆమెకు కష్టంగా ఉండేది. దీంతో ఆమె మరో వివాహం చేసుకుంది. ఆమె రెండో భర్త దుర్మార్గుడు. అతనికి మొదటి భర్త కూతురు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఓ రోజు భార్యకి వంట చేసి పెట్టాడు. ఆ సమయంలో బిడ్డ కనిపించలేదు. ఆ బిడ్డని చంపేసి భార్యకు వండి పెట్టాడు ఆ రాక్షసుడు. మాంసం కూర తినేసి తమలపాకులు, వక్క వేసుకునేటప్పుడు ఆమెకి ఇదంతా తెలిసిందట. “లికై” తమలపాకులు వేసుకునే చోటికి వెళ్ళాక అక్కడ ఒక చిన్న వేలు పడి ఉందట.. ఇది చూసి ఆశ్చర్యపోయిన ఆమెకు అసలు విషయం అర్థమైంది. ఆ తర్వాత ఆమె ఓ చేతిలో గొడ్డలితో ఊర్లో పరుగులు పెడుతూ.. చివరకు జలపాతంలో పడిపోయినట్లు చెబుతారు. దాంతో ఆమె పేరు మీదనే నోహ్కాలికై అనే పేరు వచ్చిందట.