టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రం దివారియర్. ఈ చిత్రం జులై 14 విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో రామ్ సరసన కృతిశెట్టి సందడి చేసింది. ఆది పినశెట్టి విలన్ గా నటించారు. అక్షరగౌడ, నదియా, భారతీరాజా, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో పాటు రామ్ మరోమారు తన నటన, స్టెప్పులతో అదరగొట్టాడనే చెప్పవచ్చు. వారియర్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో కథనం విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దివారియర్ సినిమా ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయంటున్నారు. ట్రేడ్ పండితులు. మొత్తానికి రూ.39.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిన ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.73 కోట్లు రాబట్టింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచే 7కోట్లపై చిలుకు షేర్ వసూలు అయింది.
కర్ణాటకలో రూ.32 లక్షలు, తమిళనాడులో రూ.94 లక్షలు, ఓవర్సిస్ లో రూ. 30 లక్షల కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని చిత్రబృందం తెలిపింది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. అతని సారథ్యంలో రూపుదిద్దుకున్న పాటలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి యాక్షన్ ఎంటర్టైనర్ ను నిర్మించారు.
Also Read :
ఒకే కథతో వచ్చిన తండ్రీకొడుకుల సినిమాలు…వాటి రిజల్ట్ ఏంటంటే..?
కాస్త ఫేమ్ రాగానే సెలబ్రెటీల మాదిరిగా ఫీల్ అవుతున్నారు…లైవ్ లో సుధీర్ పరువు తీసిన ఏడుకొండలు…!