స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్…స్నేహ రెడ్డి అనే అమ్మాయిని మార్చి 6, 2011న వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ ఒక ఫ్రెండ్స్ పెళ్లి సమయంలో కలిసారట. మొదట ఫ్రెండ్స్ గానే ఉన్న వీరిద్దరూ కొద్ది రోజులకి ప్రేమలో పడ్డారట. ఆ తర్వాత కొన్ని రోజులకి వీరిద్దరూ ఇరు కుటుంబ సభ్యులకు వారి ప్రేమ గురించి చెప్పారట. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారట కానీ స్నేహ కుటుంబ సభ్యులు కొంత ఆలోచించి కష్టం మీదే ఒప్పుకున్నారట.
Advertisement
ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువగా హీరోయిన్స్ తో కలిసి ఉంటారు. మరి ముఖ్యంగా సినిమా వాళ్లు కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోరని వద్దన్నారట. కానీ స్నేహ రెడ్డి బయట వ్యక్తులు కూడా అలాగే ఉంటారు అని వాదించడంతో వారు ఒప్పుకున్నారట. పెళ్లి సమయంలో అల్లు అర్జున్ ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదని తాజాగా అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆయన అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ… అల్లు అర్జున్ ఒక మంచి యాక్టర్. చాలా మంచి వ్యక్తి.
Advertisement
అతనికి చాలా ఆస్తులు ఉన్నాయి. నేను ఇచ్చే కట్నం అతనికి ఏ మాత్రం సరితూగదు. వివాహ సమయంలో ఒక్క రూపాయి కూడా కట్నం నా దగ్గర నుంచి వారి కుటుంబ సభ్యులు కానీ, అల్లు అర్జున్ కానీ ఆశించలేదు. అల్లుడుగా తనకి వంద మార్కులు ఇస్తున్నాను. అతను ఒకప్పుడు మంచి హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారాడు. నాకు చాలా గర్వంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ విషయంలో నేను చాలా సంతోషపడతాను అని కే.చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించిన బాలయ్య ?
అల్లు అరవింద్ వల్ల ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ…!
పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా…!