బజీ లైఫ్ లో చాలా మంది ఉదయం చల్లటి నీటి తోనే స్నానం చేస్తారు. నీటి వేడి చేసుకునేంత సమయం కూడా ఉండదు. దీంతో చల్లటి నీటి తోనే ఈ సారి కానిద్దం. మరో సారి నీటి వేడి చేసుకుందాం అని చల్లటి నీటి తోనే స్నానం చేస్తారు. అలాగే మరి కొంత మంది బద్దకం తో నీటిని వేడి చేసుకోకుండా చల్లటి నీటి తోనే స్నానం చేస్తారు. అయితే ఎలా చేసినా.. చల్లటి నీటి తో స్నానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిందే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. చాలా ఏళ్ల నుంచి చల్లటి నీరు, వేడి నీటీ పై అనేక సర్వే లు చేసిన తర్వాత శాస్త్ర వేత్తలు ఈ విషయాన్ని ప్రకటించారు.
Advertisement
Advertisement
వేడి నీటి తో స్నానం చేసిన వారి కంటే చల్లటి నీటి తోనే స్నానం చేసిన వారికే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. చల్లటి నీటి తో స్నానం చేస్తే.. శరీరం లో పెరుకుపోయిన కొవ్వు కారకాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. అలాగే చల్లటి నీరు తో స్నానం చేస్తే.. మానసిక ఒత్తిడి దూరం అవుతుందని తెలిపారు. చలి కాలంలో కూడా వేడి నీటి తో కాకుండా చల్లటి నీటీ లో అంటే స్వీమ్మింగ్ పూల్ లో లేదా సరస్సులలో నదిలలో స్నానం చేయడం అలాగే షవర్ కింద స్నానం చేయడం వల్ల కూడా మానసిక ఒత్తిడి దూరం అవుతుందని అధ్యయనం లో తెలిపారు.
అలాగే చల్లటి నీటి లో రెగ్యూలర్ గా స్విమ్మింగ్ చేస్తే శ్వాసకోస వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువ గా ఉంటాయని తెలిపారు. అయితే చల్లటి నీటి లో ఎక్కువ సమయం ఉండటం కూడా అనార్థాలకు దారీ తీస్తుందని తెలిపారు. పరిమిత సమయం లో మాత్రమే చల్లటి నీటి లో ఉండాలని సూచించారు.