Home » తొలిప్రేమ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ చెల్లెలిగా నటించిన బుజ్జి గుర్తుందా?

తొలిప్రేమ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ చెల్లెలిగా నటించిన బుజ్జి గుర్తుందా?

by Bunty
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి తొలిప్రేమ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా పవన్ కెరియర్ లోనే ఓ మైలురాయిగా నిలిచిన సినిమాల్లో తొలిప్రేమ ఒకటి. 1998 లో విడుదలైన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ను యూత్ కి బాగా కనెక్ట్ చేసింది తొలిప్రేమ.

Advertisement

అమాయకమైన ప్రేమికుడిగా ప్రియురాలికి తన ప్రేమ విషయం చెప్పేందుకు తాపత్రయపడే యువకుడి పాత్రలో పవన్ నటన అందరిని ఆకర్షించింది. ఆ తొలిప్రేమ మూవీలో అతని చెల్లెలి క్యారెక్టర్ తో అదరగొట్టింది వాసుకి. ఆ మూవీలో పవన్, వాసుకి కాంబినేషన్లో వచ్చే సీన్లు ఆడియన్స్ ను చాలా బాగా ఆకట్టుకున్నాయి. అయితే పెళ్లి తర్వాత వాసుకి సినిమాలకు దూరమైపోయింది. ప్రెసెంట్ వాసుకి, ఆనంది సాయి జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అందులో ఒకరు కొడుకు మరియు ఒకరు కూతురు. ఆమె ప్రజెంట్ ఐటి దిగ్గజ కంపెనీ అయినా గూగుల్ లో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. మరియు వారి ఇద్దరి పిల్లల ఆలనా పాలనలోనూ చాలా బిజీగా ఉంటుంది. ఆమె నెట్టింట్లో కూడా ఫుల్ జోష్ గా కనబడుతోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తుంది. అలాగే తాను ఎంజాయ్ చేసిన టూర్, వెకేషన్ ఫిక్స్ కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది.

read also :Prithvi Shaw : పృథ్వి షాపై దాడి వీడియో బయటకి! తప్పు ఎవరిది?

Visitors Are Also Reading