సాధారణంగా కొంతమంది నటీనటులు మన మధ్య ఉన్నా లేకపోయినా మన మనస్సులో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తారు. అలాంటి గొప్ప ఆర్టిస్ట్ గురించి ఎంత మాట్లాడుకున్నప్పటికీ అది తక్కువే అవుతుంది. అలాంటి నటుల్లో రియల్ స్టార్ శ్రీహరి ఒకరు. ఆయన కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో నటించేందుకు అవకాశాల కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అలాంటి సమయంలో వచ్చినటువంటి ప్రతీ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని విలన్ గా చాలా సినిమాల్లో నటించాడు.
Advertisement
అలా వచ్చిన ఫేమ్ తో హీరోగా మారి చాలా సక్సెస్ లు అందుకున్నాడు. ఒక వయస్సుకి వచ్చిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించాడు. శ్రీహరి ఇప్పుడు బతికి ఉంటే ఇంకా ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించేవాడో.. తెలుగు సినిమా చేసుకున్న దురదృష్టం వల్ల ఆయన నేడు భౌతికంగా మన మధ్యలో లేరు. శ్రీహరి వ్యక్తిగత జీవితం గురించి దాదాపు అందరికీ తెలిసిన విషయమే. డిస్కో శాంతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడులు కలరు. ఈ విషయం ఎవరినీ అడిగినా చెబుతారు. కానీ వీళ్ల పెళ్లి గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వీరి పెళ్లికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది. అది ఏంటంటే.. శ్రీహరి హీరోగా మారకముందే డిస్కో శాంతిని ప్రేమించాడు. సినిమాల్లోకి హీరోయిన్ అవ్వాలనే కలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఫస్ట్ రెండు సినిమాల్లో హీరోయిన్ గానే నటించింది. కానీ రెండు సినిమాలు ఆర్థిక సమస్యల కారణంగా విడుదల కాలేదు.
Advertisement
ఇక అప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న తన కుటుంబంని పోషించడం కోసం ఐటమ్ సాంగ్స్ ని చేస్తూ వచ్చింది. అలా వచ్చిన డబ్బులతోనే తన తోబుట్టువుల పెళ్లిళ్లను కూడా చేసింది. శ్రీహరి పెళ్లి చేసుకుందామని అడిగినప్పుడు మాత్రం నాకు ఇంట్లో చాలా బాధ్యతలున్నాయి.. పెళ్లి చేసుకోలేనని చెప్పిందట. పెళ్లి జరిగిన తరువాత నేను మొత్తం చూసుకుంటాను.. నువ్వు సినిమాలు చేసినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి గుడికి తీసుకెళ్లి తాళి కట్టాడట. శ్రీహరి కట్టిన తాళిని వెంటనే తీసేసి దేవుడి హుండీలో వేసిందట. అది ఆమె మొక్కు అని శ్రీహరి అడిగినప్పుడు చెప్పిందట. ఆ తరువాత వీరిద్దరూ 1996లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అలా రెండుసార్లు డిస్కో శాంతిని పెళ్లి చేసుకున్నాడు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
వివాదంలో చిక్కుకున్న సాయి ధరమ్ తేజ్.. హారతి ఇవ్వడానికి కారణం ఎవరు ?