బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన వీజే సన్నీ.. ఏకంగా కప్పు నే గెలిచాడు. అయితే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ సమయంలో సన్నీ కప్ గెలిచిన తర్వాత వాళ్ల అమ్మ కళావతి అంటూ ముద్దుగా పిలచి బిగ్ బాస్ కప్పును ఆమె చేతిలో పెట్టాడు. అయితే సన్నీ హౌస్ లో ఉన్న సమయంలో గానీ ఎప్పుడు అయిన తన తల్లి గురించి మాత్రమే మాట్లాడే వాడు. తన తండ్రి గురించి ఎక్కుడా కూడా మాట్లాడ లేదు. అయితే తాజా గా సన్నీ ఒక ఇంటర్వ్యూ లో తన తల్లి దండ్రుల గురించి మాట్లాడాడు.
Advertisement
Advertisement
తన లాంటి సందర్భం ఎవరికీ రాకూడదంటూ ఎమోషనల్ కూడా అయ్యాడు. వాళ్లు విడిపోయారని అన్నారు. సన్నీ ఏడాది వయస్సు ఉన్న సమయంలోనే ఇద్దరూ విడిపోయారని తెలిపారు. అయితే తాను తల్లి కళావతి ప్రేమిస్తానని తండ్రి ని గౌరవిస్తానని తెలిపాడు. అయితే వీరు ఎలా విడిపోయారో తనకు తెలియదని అన్నారు. ఈ విషయం పై తన తల్లి తో కూడా ఎప్పుడూ కూడా చర్చించలేదని అన్నారు. అయితే అమ్మా నాన్ని ఇద్దరూ కూడా మంచి వారే అని అన్నారు. వారి పర్సనల్ విషయంపై తాను ఎప్పుడు చర్చించలేదని అన్నాడు.
read more.. టాలీవుడ్ లో ఐకమత్యమే లేదు : హీరో నాని సంచలనం