భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం ఒకటి. హిందువులు అయ్యప్పను హరిహరసుతుడిగా భావించి పూజలు చేస్తుంటారు. ఇక ఈ ప్రదేశం పశ్చిమ కనుమలలో ఉంది. కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం కిందకి వస్తుంది. సముద్ర మట్టం నుంచి గుడి సుమారు 3వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయం దర్శనానికి వచ్చే భక్తులు 41 రోజుల పాటు దీక్షచేస్తారు. కొన్ని కఠినమైన నియమాలతో దీక్షచేసి, ఇరుముడితో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
Advertisement
సుమారు 203 ఏళ్ల కిందట అనగా.. 1819లో 70 మంది శబరిమల యాత్ర చేశారట. ఆ సంవత్సర ఆదాయం రూ.7 పందళరాజు వంశీయుల రికార్డులో ఉంది. 1907లో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పై కప్పు ఎండుగడ్డి, ఆకులతో కప్పబడి ఉండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్య కాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవ్వడంతో మరల తిరిగి దేవాలయాన్నిపున:నిర్మించినట్టు తెలుస్తోంది. శిలా విగ్రహానికి బదులు, అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్టించారు.
Advertisement
ఆ పంచలోహ విగ్రహం ప్రతిష్టించిన తరువాతనే శబరిమల వైభవం పెరిగిందట. ఆ తరువాత భక్తుల సంఖ్య రాను రాను భారీగా పెరిగిపోయింది. భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి కన్ను కుట్టి 1950లో దేవాలయాన్ని, విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయం మూడు సార్లు అగ్నికి ఆహుతి అయింది. దేవస్థానం బోర్డు, భక్తుల విరాళాలతో ఇప్పుడు ఉన్న దేవాలయాన్ని పున:నిర్మించి పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని చెంగనూరు వాస్తవ్యులు శ్రీ అయ్యప్పన్, శ్రీ నీలకంఠన్ అనే శిల్పులు ఇద్దరూ కలిసి రూపుదిద్దారట.
Also Read : Balli Sastram in Telugu: మన శరీరంలో ఏయే భాగాలలో బల్లి పడితే ఎలాంటి ఫలితాలుంటాయో మీకు తెలుసా..?