కాంచికౌల్…. ఈ హీరోయిన్ గురించి పేరు చెబితే ఎవరూ పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కానీ సంపంగి సినిమాలో హీరోయిన్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఈ అమ్మడు సంపంగి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రేమకు కులమతాలతో సంబంధం లేదని, ఒక హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు.
ఈ సినిమాలో హీరోగా దీపక్, హీరోయిన్గా కాంచికౌల్ నటించారు. ఈ సినిమాలో కాంచికౌల్ తన అద్భుతమైన నటన, అందంతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించినప్పటికీ ఆ సినిమా అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ వైపుకు వెళ్ళిపోయింది. అక్కడ కూడా సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో ఈ అమ్మడు సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. దాదాపు నాలుగైదు సీరియల్లలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక సీరియల్స్ లో నటిస్తున్న సమయంలోనే షబ్బీర్ తో ప్రేమలో పడింది.
Advertisement
కుటుంబసభ్యులకు వీరి ప్రేమ విషయం చెప్పి వారిని ఒప్పించి వీరు 2011లో వివాహం చేసుకున్నారు. ఇక వీరికి ప్రస్తుతం ఇద్దరు కుమారులు. ఇక వివాహ అనంతరం కాంచికౌల్ తన పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యులకు కేటాయించింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు సీరియల్స్ కు దూరంగా ఉంటూ కుటుంబంతో సంతోషంగా ఉంటుంది. 40 పదుల వయసు వచ్చినప్పటికీ కాంచికౌల్ ఇప్పటికి ఎంతో అందంగా, యంగ్ గా కనిపిస్తోంది.
View this post on InstagramAdvertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!