ఇప్పుడైతే మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్నారు కానీ అప్పట్లో రాజవంశం వారే పరిపాలిస్తూ ఉండేవారు. ప్రపంచం మారింది,ప్రజలు కూడా మారారు. దేశాలన్నీ స్వతంత్రంగా మారిపోయాయి. దీంతో మెల్లి మెల్లిగా ఈ రాచరిక కుటుంబాలన్ని కనుమరుగైపోయాయి. అయితే ఒకప్పుడు ఉన్న రాజ్యాలైతే లేవు కానీ రాజకుటుంబాలు మాత్రం ఇప్పుడూ అలాగే ఉన్నాయి. ఇప్పటికి కూడా వారంతా విలాసవంతమైన జీవితాలనే కొనసాగిస్తున్నారు. ఆ రాజకుటుంబాలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..?
1. ద రాయల్ ఫ్యామిలీ ఆఫ్ జైపూర్
వీరిని కచ్వాహాస్ అని పిలువబడే రాజ్ పుత్ వంశానికి చెందిన వారని చెబుతారు. వీరు శ్రీరాముడి కుమారులైన లవకుశలో కుశుడి వంశానికి చెందిన వారు. భవాని సింగ్ ఈ రాజవంశానికి చివరి రాజు. అతనికి కుమారులు లేనందున తన కూతురు కొడుకైనా పద్మనాబ్ సింగ్ ను దత్తత తీసుకొని జైపూర్ మహారాజుగా ప్రకటించాడు. ఈ రాయల్ ఫ్యామిలీ ఇప్పుడు జైపూర్ లోని సిటీ ప్యాలెస్ లో నివసిస్తున్నారు.
Advertisement
2. ది నవాబ్స్ ఆఫ్ పటౌడి
ఈ పటౌడి నవాబులు ఇండియన్ నవాబ్స్ కి చెందినటువంటి రాయల్ ఫ్యామిలీకి చెందిన వారు.వీళ్ళు నార్త్ ఇండియా లోని పటౌడి సంస్థానానికి చెందిన పాలకుల వంశం. వీరి పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చారు. అయితే 16వ శతాబ్దంలో భారతదేశం వీరిని గుర్తించింది. వీరి వారసుడైన బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు ఈ సంస్థానానికి పదవ నవాబు గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఇబ్రహీం పాలేస్ లో నివసిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ సంపద కంటే ఇతని స్థిరాస్తుల విలువ 700 కోట్లకు పైగా ఉంటుంది.
Advertisement
3.ద గైక్వాడ్స్ ఆఫ్ బరోడా
ఈ గైక్వాడ్స్ అనేవారు మరాఠా రాజ్యానికి చెందిన వారు. పూర్వం మన దేశాన్ని పరిపాలించిన రాయల్ ఫ్యామిలీస్ లో మరాఠా రాజవంశం కూడా ఒకటి. వీరిలో గైక్వాడ్స్ 18వ శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చి బరోడాలో స్థిరపడ్డారు. ఆ తర్వాత బరోడా పాలకులుగా మారారు. బరోడా రాజుగా సమర్జీత్ సింగ్ కొనసాగుతున్నారు.ప్రస్తుతం వీళ్లు లక్ష్మీ విలాస్ ప్యాలెస్ లో నివసిస్తున్నారు. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ తోపాటు మోతీ బాగ్ స్టేడియం, మహారాజా పతే సింగ్ మ్యూజియం తోపాటు 600 ఎకరాల రియల్ ఎస్టేట్ కి యజమాని గా మారారు.
ALSO READ;
బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీని ఏలుతున్న 6గురు స్టార్ హీరోలు వీరే..!
పవన్ కళ్యాణ్ ఉంగరాలు ధరించడానికి అసలు కారణం అదేనా..?