సాధారణంగా ప్రస్తుతం దక్షిణాది సినిమాలు వరుస హిట్ లతో పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నాయి. ఇందులో నటించే స్టార్స్ ఒక్క సినిమాకి కోట్లలో పారితోషికాలు తీసుకుంటున్నారు. రజినీకాంత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వరకు వీరి పారితోషికాలు ఎంతో తెలిస్తే నోరెళ్ల బెడుతారు. ఈ హీరోలు ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సూపర్ స్టార్ రజినీకాంత్
దక్షిణాదిన తలైవాగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సీనియర్ నటుడు రెమ్యునరేషన్ గా అక్షరాల రూ.125 కోట్ల వరకు తీసుకుంటున్నాడట.
కమల్ హాసన్ :
రజనీ తర్వాత దక్షిణాదిన అత్యంత ప్రజాదరణ పొందిన హీరో కమల్ హాసన్ అనే చెప్పాలి. దాదాపు 60 ఏళ్లుగా సినీ దునియాని ఏలుతున్న కమల్ ఒక్కో సినిమాకు రూ.75 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
అజిత్ :
తమిళ హీరో అజిత్ కూడా పారితోషికం బాాాగానే తీసుకుంటున్నట్టు సమాచారం. ఒక్కో సినిమాకు రూ.105 కోట్లు తీసుకుంటాడట. అజితో సినిమాలతో పాటు బైక్ రైడింగ్‌లోనూ బాగానే సంపాదిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
అల్లు అర్జున్ :
Advertisement
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గుర్తింపు పొందిన అల్లు అర్జున్.. ఈ మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. తొలుత తన రెమ్యునరేషన్ చాలా తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక్కో మూవీకి రూ.75 కోట్ల వరకు తీసుకుంటాడని టాక్ వినిపిస్తోంది.
ప్రభాస్ :
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమా నుంచి ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి ఏకంగా రూ.100 కోట్లు తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ :
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కూడా దక్షిణాదిన యమ క్రేజ్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గతంలో ఒక్కో సినిమాకి 40-45 కోట్ల రూపాయలు తీసుకుంటున్నప్పటికీ.. RRR తర్వాత అది రూ.100 కోట్లకు పెంచినట్లు సమాచారం.
రామ్ చరణ్ :
ఎన్టీఆర్ తో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించిన మరో హీరో రామ్ చరణ్ కూడా ఒక్కో సినిమాకు 100 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. అయితే రామ్ చరణ్ మత్రం రూ.15 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నట్లు తెలిపారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
అల్లు అరవింద్ వల్ల ఉదయ్ కిరణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా…?
విగ్గు పెట్టుకుంటారా అన్నందుకు.. బాలయ్య ఏమన్నారో తెలుసా ?