అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్ తో ‘ఏజెంట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 28న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అఖిల్ గత సినిమాలకి సంబంధించిన వసూళ్లు, బిజినెస్ పట్టించుకోకుండా నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాపై రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టడం ఆశ్చర్యకరం. ఇప్పటివరకు అఖిల్ నాలుగు సినిమాలు చేస్తే.. అందులో మూడు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. కేవలం ఒకే ఒక్క సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. అలాంటిది ఇప్పుడు రూ.80 కోట్ల బడ్జెట్ తో రావడం అంటే అసలు మామూలు విషయం కాదు.
Also Read : బొంబాయి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ హీరో ఎవరో తెలుసా ?
Advertisement
బడ్జెట్ కు తగినట్టు బిజినెస్ అయితే కాలేదు. కానీ రికార్డు ప్రకారం చూసినట్టయితే.. బిజినెస్ బెటర్ గా జరిగినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.36.25 కోట్లకు అమ్మారట నిర్మాత అనిల్ సుంకర. నైజాం ఏరియాలో ఏజెంట్ సినిమా హక్కులను రూ.10 కోట్లకు అమ్మగా.. రాయలసీమలో 4.5 కోట్లు, ఆంధ్రాలో అన్ని ఏరియాలో కలిపి 14.80 కోట్లకు అమ్ముడుపోయాయంట. ఏపీ, తెలంగాణలో కలిపి 29.3 కోట్ల బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ.3.8 కోట్లు పలికాయి. ఓవర్సీస్ రైట్స్ రూ.3.1 కోట్లకు అమ్మారు. మొత్తం వరల్డ్ వైడ్ గా ఏజెంట్ సినిమా థియేట్రికల్ హక్కులు 36.2 కోట్లు అని తెలుస్తోంది.
Advertisement
Also Read : కీర్తి సురేష్ ఏడాదికి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!
ఇక దీనిని బట్టి చూస్తే.. ఈ సినిమా రూ.37 కోట్ల వసూళ్లను సాధిస్తే లెక్క సరిపోతుంది. గ్రాస్ కలెక్షన్లు రూ.60 కోట్ల వరకు రావాల్సి ఉంటుంది. మరీ ఏజెంట్ సినిమాతో అఖిల్ ఏ రేంజ్ లో వసూళ్లను సాధిస్తాడో లేదో చూడాలి. ఈ సినిమా హిట్ అయితే అఖిల్ కి టాలీవుడ్ లో తిరుగుండదు. పాన్ ఇండియా స్థాయిలో తనకి మార్కెట్ పెరుగుతుంది. ఇప్పటికే అఖిల్ సినిమా ప్రమోషన్స్ లో చాలా కష్టపడ్డాడు. భారీ యాక్షన్ గా తెరకెక్కిన ఈ చిత్రం అఖిల్ పేరు నిలబడుతుందో లేదో వేచి చూడాలి.
Also Read : Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత…అత్యంత క్రిటికల్ గా పరిస్థితి ?