Home » పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ రీ రిలీజ్ తో బయ్యర్స్ ఎంత లాభమో తెలుసా ?

పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ రీ రిలీజ్ తో బయ్యర్స్ ఎంత లాభమో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా కొత్త సినిమాలు విడుదలైతే కోట్లాది రూపాయలు కలెక్షన్లు వస్తుంటాయి. కానీ కొత్త సినిమా కానున్నప్పటికీ ప్రసాద్ ల్యాబ్స్ లో మూలనపడిన పాత సూపర్ హిట్ మూవీల రీల్స్ తో కూడా కోట్లాది రూపాయలు సంపాదించవచ్చని రీసెంట్ గా రీరిలీజ్ అయినటువంటి సినిమాలు నిరూపిస్తున్నాయి. పాత సినిమా నుంచి నగటివ్ ని తీసుకొని దానిని లేటస్ట్ 4K టెక్నాలజికి మార్చి డాల్బీ అట్మాస్ సౌండ్ ని మిక్స్ చేసి అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ ప్రయత్నంలో పలు సినిమాలు గ్రాండ్ సక్సెస్ సాధించాయి.

Advertisement

కొన్ని సినిమాలు మాత్రం కనీస స్థాయిలో కూడా వసూళ్లను రాబట్టలేక నష్టాలను మిగిలించాయి. పాత సినిమాని 4K కి మార్చాలంటే.. కచ్చితంగా రూ.20లక్షల రూపాయల వరకు ఖర్చుఅవుతుంది. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్  తొలిప్రేమ మూవీకి కూడా అంతే ఖర్చు అయింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిన ఈ మూవీని రీసెంట్ గా విడుదల చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం సునామీ లాంటి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ మూవీకి ఫస్ట్ డే రూ.కోటి 40లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇక ఇదే ఊపుని రెండో రోజు కూడా కొనసాగించింది. రెండో రోజు ఈ సినిమాకి రూ.30లక్షలకి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. కేవలం హైదరాబాద్ సిటీ నుంచే 20 లక్షల రూపాయలు వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాకి అన్ని ఏరియాల్లో డీసెంట్ స్థాయి వసూలు వచ్చాయి. 

Advertisement

అలా రూ.20లక్షల ఖర్చుతో ఈ మూవీ మూడు రోజుల్లోనే రెండు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.  ప్రస్తుతం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సినిమా లేకపోవడంతో మరో వారం రోజుల పాటు ఈ సినిమాకి వసూళ్లు బాగానే వస్తాయని పేర్కొంటున్నారు. అలా మొత్తం మీద ఈ సినిమా ఫుల్ రన్ లో రూ. 3 కోట్ల రూపాయల గ్రాస్, కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు. దీంతో నిర్మాతకు దాదాపు రూ. కోటికి పైగా మిగిలే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ నగరానికి ఏమైంది అనే మూవీ కూడా ఇదే స్థాయి వసూళ్లను రాబడుతుంది. సరైన సినిమా లేక బిజినెస్ జరగక ట్రేడ్ మొత్తం డల్ అయిపోయిన సందర్భంలో రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు  సృష్టిస్తూ బయ్యర్స్ కి లాభాల వర్షం కురిపిస్తున్నాయి. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే అత్యధిక పారితోషికం తీసుకున్న నాగయ్య.. చివరి రోజుల్లో అలా జరిగిందా..?

Salar: సలార్ కు కెజిఎఫ్ క్లైమాక్స్ కు సంబంధం ఉందా? సలార్ టీజర్ లో ఇది గమనించారా?

 పవన్ కళ్యాణ్ నుంచి నిహారిక వరకు.. మెగాఫ్యామిలీలో కులాంతర వివాహాలు చేసుకుంది వీరే!

Visitors Are Also Reading