సరిగ్గా ఇదే రోజు అనగా.. ఫిబ్రవరి 08న పదేళ్ల కిందట 2013లో మిర్చి సినిమా విడుదలైంది. రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క శెట్టి జంటగా నటించారు. కొరటాల శివ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రభాస్ అన్నయ్య ప్రమోద్, స్నేహితుడు వంశీ యూవీ క్రియేషన్స్ అనే ఓ సంస్థను ప్రారంభించి మొదటి సినిమాగా మిర్చి తీశారు. ఈ చిత్రం ప్రభాస్ సినీ కెరీర్ లోనే ఓ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక అప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి ప్రభాస్ తో బాహుబలి చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఆ సమయంలో మిర్చి విజయం బాహుబలి సినిమాకి ఎంతో ఉపయోగపడింది. మిర్చి సినిమా కంటే ముందు ప్రభాస్ నటించిన సినిమాలు ఏవీ కూడా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.
Advertisement
దర్శకుడు కొరటాల శివ చాలా మంది వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా.. రైటర్ గా పని చేసి తొలిసారి మిర్చి సినిమాతో హిట్ కొట్టాడు. ఒక సామాజిక సమస్యకి వాణిజ్య హంగులు పూసి ఎలా ఒక అద్భుతమైన హిట్ సినిమా తీయవచ్చో ఈ చిత్రం ద్వారా చూపించాడు కొరటాల శివ. మిర్చి చిత్రంలో ఓ మెసేజ్ కూడా ఉంటుంది. అదేవిధంగా వాణిజ్యపరమైన అంశాలు చాలానే ఉన్నాయి. మిర్చి సినిమా అప్పటి నుంచి కొరటాల శివ అగ్రదర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. మిర్చి సినిమాలో సత్యరాజ్ పోషించిన పాత్ర వల్ల అతనికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. తొలుత ఈ పాత్రకు ప్రకాశ్ రాజ్ ని అనుకున్నారు. కానీ ప్రకాశ్ రాజ్ చాలా బిజీగా ఉండడం వల్ల సత్యరాజ్ ని తీసుకున్నారట. ఈ చిత్రం సత్యరాజ్ కి టాలీవుడ్ లో మంచి అవకాశాలు రావడానికి నాంది పలికింది. నదియా కి మిర్చి సినిమా రెండో ఇన్నింగ్స్ లాంటిది. ఈ చిత్రంతో తెలుగులో ఆమె చాలా సినిమాలను చేసింది. ఇప్పటికీ చేస్తోంది కూాడా.
Advertisement
ఇందులో పాటలన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి. దేవీ శ్రీ ప్రసాద్ ఇందుకు సంగీతమందించాడు. ముఖ్యంగా ఇందులో స్పెషల్ సాంగ్ అయినటువంటి పండుగలా దిగివచ్చావు.. ఇప్పటికీ ఈ పాటను మీమ్స్ కి వాడుతుంటారు. మిగతా పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. మిర్చి సినిమా ఇంత మందికి స్పెషల్ గా ఉందంటే.. అందుకు దర్శకుడు కొరటాల చూపించిన విధానమే అని చెప్పాలి. అందుకే ఈ చిత్రం చాలా మందిని నిలబెట్టింది. ఈ రోజు కూడా మిర్చి సినిమా చూస్తే ఎవ్వరికీ బోర్ అనిపించకుండా ఎన్నిసార్లు అయినా చూడవచ్చు అంటుంటారు. మిర్చి చిత్రంలో ప్రభాస్ కి జోడిగా అనుష్క తో పాటు రీచా గంగోపాధ్యాయ్ కూడా కథానాయిక నటించింది. మొత్తానికి మిర్చి సినిమా ఎంతో మందిని నిలబెట్టిందనే చెప్పవచ్చు.