ప్రపంచ దేశాల కంటే టీమిండియా కు ఎక్కువ క్రేజు ఉంది. భారత్లో క్రికెట్కు ఉన్నంత ఆదరణ మరి ఏ క్రీడ కు అంతగా ఉండదు. ప్రపంచ దేశాలతో పోలిస్తే బీసీసీఐ అత్యంత ధనిక బోర్డుగా నిలిచింది. అయితే బిసిసిఐ యొక్క నెట్వర్త్ 2.25 బిలియన్ డాలర్లు. అంటే 18760 కోట్లు. అయితే ఐదుసార్లు ప్రపంచ కప్ గెల్చిన ఆస్ట్రేలియా యొక్క నెట్వర్త్ 79 మిలియన్ డాలర్లు. అంటే 658 కోట్లు. అంటే ఆఫీస్ బోర్డు కంటే ఇండియా 28 రేట్లు ఎక్కువ.
అలాగే ఇంగ్లాండ్ బోర్డ్ యొక్క నెట్వర్త్ 59 మిలియన్ డాలర్లలతో మూడో స్థానంలో ఉంది. ఇండియా మ్యాచ్లు మరియు ఐపీఎల్ మ్యాచ్ ల వలన బీసీసీఐ యొక్క ఆదాయము గణనీయంగా పెరిగింది. దాంతో టాప్ లో కొనసాగుతుంది ఏటా ఐపిఎల్ వల్ల వేల కోట్ల ఆదాయం వస్తుంది. ప్రతి ఐపీఎల్ సీజన్ విజయవంతం కావడంతో బీసీసీఐ భారీగా ఆదాయాన్ని పొందుతుంది.
Advertisement
అందుకే ఇతర బోర్డులు బీసీసీఐ కి దగ్గరకు కూడా రావడం లేదు. బీసీసీఐ వలన ఐసీసీ కి భారీగా ఆదాయం వెళుతుంది. అందుకే బీసీసీఐ మాటకు ఐసీసీ కూడా ఓకే చెప్పే స్థితిలో ఉంది. ఇది ఇలా ఉండగా ప్రతి సంవత్సరం బిసిసిఐ పాలకమండలి ఐపిఎల్ టోర్నమెంటు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా బీసీసీఐకి భారీ స్థాయిలో ఆదాయం వస్తుంది. గత 16 సంవత్సరాలుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా కోట్లల్లోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి సంపాదించింది.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.