Home » ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన టాప్ సినిమాలు ఎన్నో మీకు తెలుసా ?

ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన టాప్ సినిమాలు ఎన్నో మీకు తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగిన ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయాలకు వెళ్లిన 9 నెలల కాలంలోనే సీఎం అయి రికార్డును క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన బాలకృష్ణ తండ్రి తగ్గ తనయుడిగా అగ్ర హీరోగా రాణిస్తున్నారు. నటవారసుడిగా అడుగుపెట్టి 48 ఏళ్లుగా హీరోగానే కొనసాగుతున్న ఏకైక హీరో బాలయ్య రికార్డును సృష్టించారు. ప్రపంచ సినీ చరిత్రలో ఓ నటవారసుడు ఇన్నేళ్లుగా హీరోగా కొనసాగిన వాళ్లు ఎవ్వరులేరు. ఇక మొత్తానికి ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి నటించిన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Manam News

Advertisement

ఎన్టీఆర్ అడుగు జాడల్లో హీరోగా అడుగుపెట్టిన బాలకృష్ణ.. తండ్రి పోషించిన శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణదేవరాయలు వంటి పాత్రల్లో నటించడం విశేషం.

తాతమ్మ కల : 

1974లో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాతమ్మకల సినిమాతో బాలకృష్ణ నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో తాతమ్మ కల ను నెరవేర్చే మునిమనవడి పాత్రలో బాలయ్య అప్పట్లోనే అద్భుతమైన నటన కనబరిచాడు. తండ్రి ఎన్టీఆర్ కాంబోలో బాలయ్య ఫస్ట్ మూవీ. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరో తనయుడు హరికృష్ణ కూడా నటించారు. 

అన్నదమ్ముల అనుబంధం : 

తండ్రి ఎన్టీఆర్-తనయుడు బాలకృష్ణ కాంబోలో వచ్చిన రెండో చిత్రం అన్నదమ్ముల అనుబంధం. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. నిజజీవితంలో తండ్రి కొడుకులు ఎన్టీఆర్, బాలకృష్ణ ఈ మూవీలో అన్నదమ్ములుగా నటించారు.

వేములవాడ భీమకవి : 

ఎన్టీఆర్-బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన మూడో మూవీ వేములవాడ భీమకవి. ఈ సినిమాలో బాలకృష్ణ కాంబోలో వచ్చిన మూడో సినిమా వేములవాడ భీమకవి. బాలయ్య టైటిల్ రోల్ పోషించడం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అనిపించుకుంది.  

దానవీర శూరకర్ణ : 

ఎన్టీఆర్-బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన నాలుగో చిత్రం దాన వీరశూరకర్ణ. ఈ మూవీలో బాలకృష్ణ అభిమన్యుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. దాదాపు 15రెట్లు లాభాలు వచ్చాయట. 

అక్బర్ సలీం అనార్కలి :

తండ్రి రామారావుతో తనయుడు బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఐదో సినిమా అక్బర్ సలీం అనార్కలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ అక్బర్ పాత్రలో కనిపించగా.. బాలయ్య సలీం పాత్రలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని అందుకోలేదు. అక్బర్ సలీం అనార్కలి సినిమా తెలుగు అప్పటికే వచ్చిన అనార్కలితో పాటు హిందీలో వచ్చిన మొఘల్ ఏ ఆజం సినిమాకి రీమేక్.  ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో తెరకెక్కించారు. 

Advertisement

శ్రీ మద్విరాట పర్వము :

ఎన్టీఆర్-బాలకృష్ణ కాంబోలో వచ్చిన 6వ చిత్రం శ్రీమద్విరాట పర్వము. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నడిచింది. ఇందులో ఎన్టీఆర్ శ్రీకృష్ణ, అర్జున, దుర్యోదన, కీచకుడు,బృహన్నలగా ఐదు పాత్రలు పోషించాడు. బాలయ్య మరోసారి అభిమన్యుడి పాత్రలో నటించాడు.  

శ్రీ తిరుపతి వేంకటేశ్వర్య కళ్యాణం :

తండ్రి నందమూరి తారకరామారావుతో తనయుడు బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన ఏడో చిత్రం శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం. ఈ సినిమాలో ఎన్టీఆర్ వేంకటేశ్వర స్వామి పాత్రలో నటిస్తే.. బాలయ్య నారధుడి పాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. 

రౌడీ రాముడు  కొంటె కృష్ణుడు :

ఎన్టీఆర్-బాలయ్య కాంబోలో వచ్చిన ఎనిమిదో చిత్రం రౌడీ రాముడు కొంటె కృష్ణుడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని సాధించింది. 

అనురాగ దేవత :

ఎన్టీఆర్-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కిన తొమ్మిదో చిత్రం అనురాగ దేవత. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. 

సింహం నవ్వింది :

ఎన్టీఆర్-బాలకృష్ణ కాంబోలో వచ్చిన 10వ చిత్రం  సింహం నవ్వింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర : 

తండ్రి తారకరామారావుతో తనయుడు బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన 11వ చిత్రం శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గోల్డెన్ జూబ్లీ సక్సెస్ సాధించింది. 

బ్రహ్మర్షి విశ్వామిత్ర :

ఎన్టీఆర్-బాలయ్య కాంబోలో వచ్చిన 12వ చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. మొత్తం ఎన్టీఆర్-బాలకృష్ణ కలిసి 12 చిత్రాల్లో నటించారు. ఇవేకాకుండా కొన్ని సినిమాల్లో బాలయ్య బాలనటుడిగా కూడా నటించాడు. 

తండ్రి ఎన్టీఆర్ జీవితంపై తనయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో నటించారు. ఈ చిత్రాలకు క్రిష్ దర్శకత్వం వహించారు.  ఎన్టీఆర్ బయోపిక్ లో నటించిన ఏకైక నటవారసుడిగా బాలకృష్ణ చరిత్రలో నిలిచాడు ఓ నటుడి జీవితంపై తెరకెక్కించిన మూవీలో ఆయన వారసుడు హీరోగా నటించడం రేర్ ఫీట్ అనే చెప్పాలి. మరోవైపు తండ్రి ఎన్టీఆర్ పోషించిన పలు పాత్రలను తనయుడు బాలయ్య కూడా పోషించడం విశేషం. ఇలా అందరికీ సాధ్యం కాకపోవచ్చనే చెప్పాలి. 

  

Visitors Are Also Reading