అలనాటి సీనియర్ నటి రాధ కూతురు కార్తీక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు తాజాగా నవంబర్ 19వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. రోహిత్ మీనన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
Do you know how many crores Radha gave her daughter as dowry
వీరి వివాహం కెరళలో తిరువనంతపురంలోని ఉదయ్ సముద్ర లీజర్ బీచ్ హోటల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి చిరంజీవి దంపతులు, రాధిక సుహాసిని, రేవతి వంటి సినీ ప్రముఖులు అందరూ హాజరయ్యారు. ఇక వివాహ సమయంలో కార్తిక ఎరుపు రంగు చీరలో ఒంటినిండా నగలతో అలంకరించుకొని కుందనపు బొమ్మలా కనిపించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వివాహం వేడుకలు మొదలైనప్పటి నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ వంటి ఫంక్షన్లను చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు.
Advertisement
rangam-karthika-nair-set-to-marry-boyfriend
ప్రతి ఒక్క ఈవెంట్లో కార్తీక ఎంతో అందంగా కనిపించింది. ఇక వివాహ సమయంలో కార్తికను అత్తవారింటికి పంపే సమయంలో రాధ తన కూతురికి కానుకగా 8 కోట్ల విలువచేసే కారును, 30 కోట్ల విలువ చేసే బంగారాన్ని, అలాగే దుబాయ్ లో ఓ హోటల్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చిందట. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి తన పేరు మీద కొన్ని ఆస్తులను కూడబెట్టిందట. వాటిని కూడా రాధా తన కూతురికి గిఫ్ట్ గా ఇచ్చిందని సమాచారం.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!