దేశంలో టాలెంట్ ఉన్న స్టార్ హీరోలలో కమల్‌హాసన్ ఒకరు అనే సంగతి అందరికీ తెలిసినదే. దశవతారం సినిమా తరువాత కమల్ హాసన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించడంలో విఫలమయ్యాయనే చెప్పవచ్చు. కానీ తాజాగా కమల్ నటించిన విక్రమ్ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకున్నారు. విక్రమ్ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించడం గమనార్హం.
ఇక ఫుల్ రన్‌లో ఈ చిత్రం రూ.300 కోట్ల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విక్రమ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కమల్‌హాసన్ మాట్లాడారు. విక్రమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుపిస్తోందని పేర్కొన్నారు. ఖైదీ మూవీని చూసిన తరువాత తాను లోకేష్ కనగరాజ్‌కు తను హీరోగా తెరకెక్కే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చానని కమల్ చెప్పుకొచ్చారు. విక్రమ్ సినిమా ఓ మంచి మూవీ అవుతుందని తాను నమ్మానని కమల్ తెలిపారు.
ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాడని కమల్ హాసన్ వెల్లడించారు. ఇక మరో చరిత్ర సినిమా సక్సెస్ సాధించడం ద్వారా తెలుగులో తన సక్సెస్ సాధించే అవకాశం దక్కిందని చెప్పారు కమల్ హాసన్. మరోచరిత్ర సినిమా తెలుగు వెర్షన్ చెన్నైలో సబ్ టైటిల్స్ లేకుండా రెండున్నరేళ్లు ప్రదర్శితమైందని కమల్ హాసన్ గుర్తు చేశారు. సినిమా భాష ప్రపంచ భాష అని కమల్ కామెంట్ చేసారు. సినిమాకు ఎటువంటి భాష లేదని కమల్ హాసన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విక్రమ్ సినిమాహిట్ కావడంతో కమల్ తీసే తరువాత సినిమాపై భారీ అంచనా వేసుకుంటున్నారు అభిమానులు.
Also Read :
రాజమౌళి సినిమాలో ఐశ్వర్యరాయ్..! ఈ క్రేజీ అప్‌డేట్ నిజమేనా..?
ఆ ఎంపీకి భలే ఆఫర్ ఇచ్చిన కేంద్ర మంత్రి.. కేజీకీ 1000 కోట్లు..?