Home » ఆ ఎంపీకి భలే ఆఫర్ ఇచ్చిన కేంద్ర మంత్రి.. కేజీకీ 1000 కోట్లు..?

ఆ ఎంపీకి భలే ఆఫర్ ఇచ్చిన కేంద్ర మంత్రి.. కేజీకీ 1000 కోట్లు..?

by Sravanthi Pandrala Pandrala
Ad

రాజకీయ నాయకుల మధ్య అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు మనకు నవ్వు తెప్పిస్తాయి. చమత్కారంగా అన్న మాటలే నిజమవుతాయి. రాజకీయం అంటేనే ఈ విధంగా ఉంటుంది. అయితే ఒక సంఘటన మధ్యప్రదేశ్ ఉజ్జయిని ఎంపీని తీవ్రంగా మార్చేసింది. తమ నియోజక వర్గానికి నిధులు తీసుకురావడం కోసం జిమ్ లో వర్కౌట్లు మామూలుగా చేయడం లేదు. స్విమ్మింగ్, సైక్లింగ్,డైటింగ్ లాంటివి చేస్తూ ఎలాగైనా బరువు తగ్గించుకొని కండలు పెంచుకోవాలని అనేక కసరత్తులు చేస్తున్నారు. మరి ఆ ఎంపి బరువు తగ్గడానికి నియోజక వర్గానికి నిధులు తేవడానికి మధ్య సంబంధం ఏమి ఉంటుందని మీరు అనుకుంటున్నారు కదూ..

Advertisement

ఇందులోనే అసలు ట్విస్ట్ ఉంది.. అది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సవాలే అని చెప్పవచ్చు.. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం..? ఉజ్జయినిలోని మాల్వా లో పలు అభివృద్ధి పనులు శంకు స్థాపన కొరకు ఫిబ్రవరిలో నితిన్ గడ్కరీ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలోనే అధిక బరువుతో ఉన్నటువంటి ఎంపీ అనిల్ ఫిరోజియాను చూసినటువంటి గడ్కరి చాలా ఆశ్చర్య పోయారట. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నువ్వు బరువు తగ్గాలనీ ఎంపీకి సవాల్ విసిరారు నితిన్ గడ్కరీ.. నియోజక వర్గానికి నిధులు కేటాయించాలనీ ఎంపీ అనిల్ ఎప్పుడూ గడ్కరీ చుట్టూ తిరిగేవారు. నిధులు కేటాయిస్తాను కానీ, నేను పెట్టే షరతుకు ఒప్పుకుంటేనే అని అన్నారు. దానికి ఎంపీ ఒప్పుకున్నారు.

Advertisement

దీంతో నితిన్ గడ్కారీ నేను గతంలో 135 కేజీల బరువు ఉండే వాడిని ప్రస్తుతం 93 కేజీలకు తగ్గననీ అన్నారు. అలాగే నువ్వు కూడా ఎన్ని కేజీల బరువు తగ్గితే కేజీకి 1000 కోట్ల చొప్పున నిధులను కేటాయిస్తానని గడ్కరి స్టేజ్ పైన చెప్పారు. దీంతో ఎంపీ తన ఫిట్నెస్ పై దృష్టిసారించారు. అప్పటి నుంచి యోగా, స్విమ్మింగ్ లాంటివి చేస్తూ మూడు నెలల్లో 126 కేజీల నుంచి 112 కేజీలకు చేరారు. అంటే పదిహేను కిలోలు తగ్గారు. త్వరలోనే 100 కేజీల కు తగ్గుతాయని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి గడ్కరీ సవాల్ ను నేను స్వీకరించాను 15 కేజీలు తగ్గాను. ఆయన ఇచ్చిన మాట ప్రకారం వర్షాకాల సమావేశాల్లో గడ్కరీకి నా బరువు వివరాలు తెలియజేస్తాను. ఆయన మాట ప్రకారం 15 వేల కోట్ల నిధులు మా నియోజకవర్గానికి మంజూరు చేస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.

also read;

చిన్నారుల‌కు గుడ్‌న్యూస్‌.. ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల‌కు ఇంటి వ‌ద్ద‌నే ఉచిత ఆధార్ రిజిస్ట్రేష‌న్

పాండ్య ఆ పరుగు తీయకపోవడానికి అదే కారణమా..?

 

Visitors Are Also Reading