భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది వివాహం. సమాజాభివృద్ధికి ప్రధాన మూలం వివాహంలోనే దాగి ఉందని మన పెద్దలు చెబుతారు. స్త్రీ మరియు పురుషుల అనుబంధాలకు సామాజిక గుర్తింపు, ధర్మ భద్రత ఇవ్వడానికి వివాహ వ్యవస్థను రూపొందించారు. కానీ వివాహాల్లో కొన్ని పెద్దలు కుదిర్చినవి ఉంటాయి. మరికొన్ని రహస్యంగా చేసుకుంటారు. దీంట్లో సామాన్యులే కాకుండా ప్రముఖులు కూడా ఉన్నారు. ముఖ్యంగా రహస్యంగా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన హీరోయిన్లు ఎవరో చూడండి..!
జయప్రద : ఎంతో పేరున్న నటి. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటిన రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈవిడ బాలీవుడ్ ప్రొడ్యూసర్ అయినా శ్రీకాంత్ నహటనీ ఆమెను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ ప్రొడ్యూసర్ కి అప్పటికే పెళ్లయి పిల్లలు ఉండడంతో ఆ వివాహాన్ని బయటకి చెప్పలేదు.
Advertisement
సావిత్రి: దక్షిణాది చిత్రసీమలో తిరుగులేని నటిగా మహానటి గా పేరు పొంది తన కెరీర్ లో ఫిక్స్ లో ఉండగానే అప్పటికే రెండు వివాహాలు చేసుకున్న పిల్లలు కూడా ఉన్న జెమినీ గణేషన్ రహస్యంగా పెళ్ళాడి అందరికి షాక్ ఇచ్చారు.
Advertisement
శ్రీదేవి : తన అందాలతో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్న శ్రీదేవి రెండు సార్లు పెళ్ళి చేసుకున్నారు. అప్పుడు స్టార్ హీరో మిథున్ చక్రవర్తిని ప్రేమించారు. తర్వాత రహస్యంగా పెళ్లాడారు. తర్వాత మూడు సంవత్సరాల విడిపోయి బోనీకపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శ్రీదేవి.
రమ్యకృష్ణ : ఇప్పటికీ ఆమె తన నటనతో అలరిస్తోంది. నవరసాలను చాలా అద్భుతంగా పండించగల నటుల్లో రమ్యకృష్ణ ఒకరు. తన అందం అభినయంతో దక్షిణాదిలోనే ఎంతో మంది ప్రేక్షకులు సంపాదించుకున్నారు. దర్శకుడు కృష్ణవంశీ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో 2003లో ఎవరికీ తెలియకుండా రహస్యంగా గుళ్లో పెళ్లి చేసుకున్నారు.
అనన్య : మలయాళ హీరోయిన్, సినిమాల్లో నటించి నట్లే లేచిపోయి మరి పెళ్లి చేసుకున్నారు. ఆంజనేయులు అనే వ్యక్తిని వివాహమాడారు.
శ్రియ శరన్ : శ్రియా శరణ్ రష్యా కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం పిల్లలు పుట్టాక ఈ విషయాన్ని చాలా రోజులు గోప్యంగా ఉంచి పరిశ్రమకే షాకిచ్చారు. చివరికి ఆమె అన్ని సమస్యల తీరాక బయట చెప్పేశారు.