Home » అనసూయ భర్త ఏం చేస్తారో తెలుసా..?

అనసూయ భర్త ఏం చేస్తారో తెలుసా..?

by Azhar
Ad

జబర్దస్త్ ప్రోగ్రాం తో మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఆ తర్వాత పలు టీవీ షోలలో కనిపిస్తూ సినిమాల్లో కూడా నటించేది. కానీ రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత పాత్రతో మంచి నటిగా కూడా పేరు సంపాదించి బుల్లితెరతో పాటుగా వెండితెర పైన కూడా ఓ వెలుగు వెలుగుతుంది. ఈ మధ్యే అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప సినిమాలో విలన్ అయిన సునీల్ భార్యగా దాక్షాయణి పాత్రలో నటించి అందరి మెప్పు పొందింది.

Advertisement

అయితే అనసూయ అప్పట్లోనే ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో ఆమెనే ప్రకటించింది. తన భర్త పేరు సుశాంక్ భరద్వాజ్. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపించే అనసూయ తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే యాంకర్ గా అనసూయ బాగా రాణిస్తుండగా.. తన భర్త ఏం చేస్తాడు అనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఆయన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుకుంటారు.

Advertisement

కానీ అది తప్పు.. అనసూయ భర్త సాఫ్ట్‌వేర్‌ కాదు.. ఆయన ఓ ఫైనాన్షియర్‌. అలాగే ఫండింగ్‌ ప్లానర్‌. అంటే ఫండ్స్‌ ఎలా రాబట్టాలో కంపెనీలకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ఇది వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు అయాన్ష్ భరద్వాజ్, శౌర్య భరద్వాజ్. ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బాగా బిజీగా ఉన్న అనసూయ సమయం దొరికినప్పుడలా తన పిల్లలతో కలిసి సమయం గడుపుతూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

ఆ విషయంలో అశ్విన్ ను అనుసరించాలనుకున్న డుప్లెసిస్.. కానీ..?

వచ్చే ఏడాది ఐపీఎల్ అభిమానులకు శుభవార్త చెప్పనున్న బీసీసీఐ…!

Visitors Are Also Reading