Home » వాట్సాప్ లో ఒకేసారి ఎక్కువ మందికి మెస్సేజ్ ఎలా పంపాలో తెలుసా..?

వాట్సాప్ లో ఒకేసారి ఎక్కువ మందికి మెస్సేజ్ ఎలా పంపాలో తెలుసా..?

by Bunty
Ad

ప‌ర్స‌న‌ల్ చాట్ నుంచి ప్రొఫెష‌న‌ల్ క‌మ్యూనికేష‌న్ వ‌ర‌కు ఎన్నోవిధాలుగా స‌మాచార బ‌దిలీకి వాట్సాప్ యాప్‌ను వినియోగిస్తుంటాం. అయితే ఇందులోని పూర్తి ఫీచ‌ర్ల గురించి చాలా మంది యూజ‌ర్స్‌కు తెలియ‌ద‌నే చెప్పుకోవాలి. త‌రుచుగా వాడే ఆడియో, వీడియో, మెస్సేజ్ పార్వార్డ్ వంటి ప్యూచ‌ర్లు మిన‌హాయిస్తే ఇత‌ర ఫీచ‌ర్ల‌ను ఇత‌ర ప్యూచ‌ర్ల‌ను ఉప‌యోగించే వారిసంఖ్య చాలా త‌క్కువే. అయితే వాట్సాప్ ద్వారా ఒకేసారి ఎక్కువ మందికి మెస్సేజ్‌పంపాలంటే ఏమి చేయాలంటే..? దీనికి వెంట‌నే వినిపించే స‌మాధానం గ్రూపు క్రియేట్ చేయాల్సిందే.

కానీ గ్రూపులో కాకుండా వ్య‌క్తిగ‌తంగా మెస్సేజ్ పంపాలంటే మాత్రం.. ఏముందు ఒక్కో కాంటాక్టు సెలెక్ట్ చేస్తే స‌రిపోతుంద‌ని అంటారు. కానీ ఒక్కో కాంటాక్ట్ సెలెక్ట్ చేసి ఒకేసారి కేవ‌లం ఐదుగురికి మాత్ర‌మే మెసేజ్‌లు పంప‌గ‌ల‌ము. అంత‌కు మించి పంపాలంటే మాత్రం స‌రిపోదు. మ‌రి వాట్సాప్‌లో ఒకేసారి ఐదుగురికి మించి వ్య‌క్తి గ‌తంగా మెస్సేజ్ పంపేందుకు ఏమి చేయాలో తెలుసా..?

Advertisement

Advertisement

 

వాట్సాప్‌లో ఒకేసారి256 మందికి సందేశాన్ని చేర‌వేయ‌వ‌చ్చు. అందుకోసం మీరు ఈ కింది విధంగా చేస్తే స‌రిపోతుంది. ముందుగా మీరు వాట్సాప్‌లో బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ రూపొందించాలి. వాట్సాప్‌యాప్ ఓపెన్ చేసి చాట్ పేజ్‌పై కుడివైపు మూడు చుక్క‌ల‌పై క్లిక్ చేయాలి. అందులో న్యూ బ్రాడ్‌కాస్ట్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీరు మెస్సేజ్ పంపాల‌నుకుంటున్న యూజ‌ర్స్‌ను సెలెక్ట్ చేయాలి. అలా మీరు 256 మంది వ‌ర‌కు కాంటాక్ట్ ల‌ను సెలెక్ట్ చేసుకోవ‌చ్చు. తరువాత దానిని ఒకే చేస్తే మీరు ఎంపిక చేసిన కాంటాక్టుల జాబితాలో కొత్త బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ త‌యార‌వుతుంది. అందులో మీరు ఎలాంటి మెస్సేజ్ షేర్ చేసినా ప్ర‌తీ ఒక్క‌రికీ మీరు వ్య‌క్తిగ‌తంగా పంపిన‌ట్టుగా చేరుతుంది.

 

Visitors Are Also Reading