Home » ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో ఆగిపోయిన భారీ బడ్జెట్ చిత్రం ఏదో తెలుసా..?

ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో ఆగిపోయిన భారీ బడ్జెట్ చిత్రం ఏదో తెలుసా..?

by Mounika
Ad

నందమూరి తారకరామారావు ఈ పేరుని తెలుగు సినీ అభిమానులకు అంతగా పరిచయం చేయనవసరం లేదు. పెద్ద ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇండస్ట్రీలో అడిగి పెట్టిన రెండు సంవత్సరాలకే ప్రేక్షకులలో మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆది, సింహాద్రి సినిమాలతో మాస్ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్. సింహాద్రి కలెక్షన్ల దెబ్బకు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆయన ఠాగూర్ చిత్రాన్ని లేటుగా రిలీజ్ చేయటం అప్పటిలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

అయితే సింహాద్రి సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ కి ఆ తర్వాత కొన్ని ఫ్లాప్ సినిమా ఆఫర్లు వచ్చాయి. సింహాద్రి తర్వాత వచ్చిన ఆంధ్రావాలా, సాంబ,నా అల్లుడు, అశోక్ అంటే చిత్రాలు ఎన్టీఆర్కు నిరసన మిగిల్చాయి. ఈ చిత్రాలన్నీ కూడా ఎన్టీఆర్ కెరియర్ లో వరుస ప్లాప్స్ గా నిలిచాయి. ఇక పోతే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో కూడా సెట్స్ పైకి వెళ్లి ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.

త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు పూజ హెగ్డే హీరో హీరోయిన్స్ గా నటించిన అరవింద సమేత చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో మరో చిత్రం చేయాలని భావించాడట. ఎన్టీఆర్ కథను ఓకే చేసేయడంతో సినిమా ప్రారంభోత్సవం కూడా చేశారు. కానీ కథ ఫైనల్ గా ప్రేక్షకులను మెప్పించలేదేమో అనే అనుమానంతో సినిమాను ఆపేశారు.

Advertisement

ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ఊపిరి సినిమాలో హీరో కార్తీ స్థానంలో ముందుగా ఎన్టీఆర్ చేయాల్సి ఉంది. ఇక నెలరోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది అనే సమయానికి కొన్ని కారణాల వలన ఊపిరి చిత్రం నుంచి తారక్ తప్పుకున్నాడట. ఈ చిత్రం ఎంత మంచి సక్సెస్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సింంహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఎన్టీఆర్ తో భారీ బడ్జెట్ లో ‘గరుడ’ అనే చిత్రాన్ని చేద్దామనుకున్నారట రాజమౌళి. ఇక ఈ సినిమా కూడా చర్చలు జరిగి ఆగిపోయిందట. ఇక ఈ ప్రాజెక్ట్ అయినా భవిష్యత్తులో సెట్స్ పైకి రావాలని ఎన్టీఆర్ రాజమౌళి అభిమానులు కోరుకుంటున్నారు..

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

రాజమౌళి నటించి, దర్శకత్వం వహించిన మూవీ అంతగా ఆకట్టుకోలేదనే విషయం మీకు తెలుసా ?

హరిహరవీరమల్లు మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన నిధి అగర్వాల్..!

Pawan Kalyan : పవన్ కళ్యాణ్, విజయ్ కాంబోలో మిస్ అయిన ఈ మూవీ గురించి తెలుసా? ఎందుకు రిలీజ్ కాలేదంటే?

 

Visitors Are Also Reading