Home » మీ పర్సులో ఈ వస్తువులను పెట్టుకుంటున్నారా.. అయితే ప్రమాదం తప్పదు..!!

మీ పర్సులో ఈ వస్తువులను పెట్టుకుంటున్నారా.. అయితే ప్రమాదం తప్పదు..!!

by Sravanthi

 ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళేముందు పాకెట్ లో పర్సు పెట్టుకోవడం మర్చిపోరు. అబ్బాయి అయితే పర్స్, అమ్మాయి అయితే హ్యాండ్ బ్యాగ్ ఉపయోగిస్తారు. ఇందులో వారికి ఉపయోగపడాల్సిన వస్తువులన్నీ పెట్టుకుంటారు. ఈ క్రమంలో మనకు తెలిసి తెలియక కొన్ని వస్తువులను అందులో పెట్టుకుంటాం. దీనివల్ల కొన్ని దోషాలు ఉంటాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఏ వస్తువులు పర్సులో ఉండాలి ఏవి ఉండకూడదు తెలుసుకుందామా..!

పర్సులో ఉంచకూడదని వస్తువులు: కొందరు ఏదైనా వస్తువులు ఉంటే దానికి సంబంధించిన బిల్లు పర్సులో పెట్టుకోవడం అలవాటు. కానీ ఆ బిల్లులోని ఎక్కువకాలం పరుసులో ఉంచుకోకూడదట. అలా ఎక్కువ రోజులు ఉంటే లక్ష్మీదేవి మన నుంచి దూరం అవుతుందని అంటుంటారు. ఆధ్యాత్మిక నిపుణులు తెలిపిన ప్రకారం పర్సులో దేవుళ్లకు సంబంధించిన ఫోటోలను ఉంచుకోకూడదు. అలాగే మన కుటుంబ సభ్యులు చనిపోతే వారి ఫోటోలను కూడా పరుసులో పెట్టుకోకూడదట. కానీ చాలామంది తెలిసీ తెలియక ఇలాంటి పొరపాట్లు చేసి ఇబ్బందుల పాలవుతారు.ఇలాంటి వస్తువులు ఉంచుకోవాలి:ఆధ్యాత్మిక నిపుణుల ప్రకారం బియ్యం గింజలను పర్సులో పెట్టుకోండి. దీని వల్ల లక్ష్మీ కటాక్షం నీ పైనే ఎక్కువగా ఉంటుందట. అలాగే పర్సులో డబ్బులను ఒక క్రమపద్ధతిలో పెట్టుకోవాలి. చిందరవందరగా పెట్టకూడదు. ముందు పెద్ద నోట్లు ఆ తర్వాత చిన్న నోట్లు ఇలా పెట్టాలి. అలాగే నాణేలు, నోట్లను కలిపి ఒక దగ్గర అసలు పెట్టకూడదు. దీనివల్ల లక్ష్మీదేవి వెళ్లిపోతుంది.

Visitors Are Also Reading