Home » కష్టాలు, బాధల నుండి గట్టెక్కాలంటే.. శనివారం నాడు ఈ 5 దానం చేయండి..!

కష్టాలు, బాధల నుండి గట్టెక్కాలంటే.. శనివారం నాడు ఈ 5 దానం చేయండి..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా వారికి అంతా మంచే జరగాలని ఇబ్బందులు బాధలు లేకుండా ఆనందంగా జీవించాలని అనుకుంటూ ఉంటారు. బాధలు ఏమీ లేకుండా ఆనందంగా జీవించాలని శని దోషాలు వంటిని పూర్తిగా పోవాలని అనుకుంటారు. మీరు కూడా ఆనందంగా మీ జీవితాన్ని గడపాలి అనుకుంటున్నారా.. ఏ సమస్యలు లేకుండా హాయిగా ఉండాలనుకుంటున్నారా..? అయితే శనివారం నాడు వీటిని దానం చేయండి శనివారం నాడు కనుక వీటిని దానం చేశారంటే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఆనందంగా జీవించవచ్చు.

Advertisement

  • జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాడు ఆవనూనె దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది శని కారణంగా జీవితంలో ఆటంకాలు ఎదురవొచ్చు. అలాంటప్పుడు శనివారం నాడు ఆవనూనె దానం చేస్తే చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒక ఇనుప పాత్ర తీసుకొని అందులో ఆవాలు నూనె వేసి ఒక రూపాయి వేసి ఆ నూనెలో మీ ముఖం చూసుకొని ఆ నూనె ని పేదవారికి దానం చేయండి లేకపోతే మఱ్ఱి చెట్టు కింద పెట్టండి.
  • గుర్రపు నాడాకు కూడా ముఖ్యమైన స్థానం ఉంది. గుర్రపు నాడా పాతదై ఉండాలి. వాడిన నాడాను మాత్రమే ఉపయోగించండి. శుక్రవారం నాడు గుర్రపు నాడా తీసుకోండి. దాన్ని ఆవాల నూనెలో ముంచి ఉంచాలి. ప్రధాన ద్వారం మీద దీన్ని శనివారం U ఆకారంలో ఉంచండి. ఇలా చేయడం వలన దోషాలు అన్నీ పోతాయి.

Advertisement

  • నల్ల నువ్వులు, నల్ల మినప్పప్పు దానం చేయడం కూడా ఎంతో మంచిది. శనివారం సాయంత్రం 1.25 కేజీల నల్ల మినప్పప్పు ని కానీ నల్ల నువ్వులను దానం చేయండి. ఇబ్బందులన్నీ పోతాయి. సుఖంగా ఉండవచ్చు.
  • నల్లని వస్త్రాలు, చెప్పులు దానం చేస్తే కూడా దోషాలు పోతాయి. ముఖ్యంగా వ్యాధులు తో బాధ పడుతుంటే శనివారం సాయంత్రం నల్లని వస్త్రాలు, చెప్పులు దానం చెయ్యండి.
  • ఇనుప పాత్రలు ని కూడా దానం చెయ్యవచ్చు. అట్ల పెనం, పటకారు వంటి ఇనుప పాత్రలను దానం చేస్తే కూడా సమస్యల నుండి గట్టెక్కచ్చు.

Also read:

Visitors Are Also Reading