Home » పెళ్లి అవ్వట్లేదా..? పెళ్లి అవ్వాలంటే కార్తీక మాసంలో ఇలా చేయండి..!

పెళ్లి అవ్వట్లేదా..? పెళ్లి అవ్వాలంటే కార్తీక మాసంలో ఇలా చేయండి..!

by Sravanthi
Ad

కార్తీక మాసంలో చేసే పూజలకి, దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది. కార్తీకమాసంలో పూజలు ఉపవాసాలు మాత్రమే కాదు. ధర్మబద్ధమైన ఎటువంటి కోరిక నెరవేరాలన్న ఈ మాసం చాలా అనువైనది. ఈశ్వరుడుని భక్తితో ఆరాధిస్తే తెలివితేటలు, మానసిక ప్రశాంతత, గౌరవం, అడ్డంకులు తొలగిపోవడంతో పాటు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కార్తీకమాసంలో పెళ్లి అవ్వని వాళ్ళు భక్తి శ్రద్ధతో శివుడిని ఆరాధించడం వలన జీవిత భాగస్వామిని పొందవచ్చు.

Advertisement

జాతకంలో ఏ దోషం ఉన్నా కూడా శివుని అనుగ్రహం ఉంటే చాలట. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి కూడా ఒక్కో దేవత ఉంటుంది. వాటిని అది దేవుడు శివుడు చూస్తారు. గ్రహాలన్నీ శివుడు ఆదేశానుసారం సంచరిస్తాయి. కార్తీక మాసంలో పెళ్లి అవ్వాలంటే శివుడుని ఆరాధించడం మంచిది.

Advertisement

Also read:

గురు బలంతో పాటుగా కుజ, శుక్ర దోషాలు తొలగిపోవడానికి కూడా శివుడిని ఆరాధించడం మంచిది. కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. కార్తీక పౌర్ణమి నాడు శివుడిని ఆరాధించడం ఆకు, వక్క, పండ్లను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ముత్తైదువులకి వాయనాలు ఇవ్వడం కూడా మంచిది. కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం అరటి దొన్నెలో దీపాన్ని వెలిగించి నదిలో వదలడం మంచిదట. ఇలా చేస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading