Home » చాణక్య నీతి: జీవితం బాగుండాలంటే.. తప్పకుండా ఇలా చేయండి..!

చాణక్య నీతి: జీవితం బాగుండాలంటే.. తప్పకుండా ఇలా చేయండి..!

by Sravya
Ad

ఆచార్య చాణక్య చాలా విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన మనం మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఆచార్య చాణక్య లైఫ్ లో ఎదగాలంటే ఏం చేయాలి అనే దాని గురించి చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మంచి జరగాలని కోరుకుంటారు. చెడు జరగాలని ఎవరు అనుకోరు. కొన్నిసార్లు మనకి తెలియకుండా అజాగ్రత్తగా ఉంటూ ఉంటాము. దీనివలన జీవితం పాడవుతుంది. ఆచార్య చాణక్య చెప్పినట్లు కనుక మనం చేశామంటే ఖచ్చితంగా జీవితం బాగుంటుంది ఎంతో అందంగా మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు.

chanakya new

Advertisement

చాణక్య తన జ్ఞానం అనుభవంతో జీవితంలో అడ్డంకులు ఎదురైనప్పుడు ఎలా సంతోషంగా ఉండాలో చెప్పారు. చెడు ఆలోచనలు లేకుండా ఏం చేయాలో వివరించారు. అపారమైన జ్ఞానం సంపద ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చీమలు చక్కెర చుట్టూ చేరడం సహజం. జ్ఞానం సంపద ఉంటే అతని వద్ద బంధువులు స్నేహితులు అపరిచిత వ్యక్తులు కూడా వస్తూ ఉంటారు. మీ నుండి ప్రయోజనాన్ని పొందుతారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని చాణక్య అన్నారు. మనిషికి గౌరవం చాలా ముఖ్యం. ప్రతిసారి ఇతరుల ముందు అవమానంగా జీవించడం కంటే చచ్చిపోవడం మేలు.

Advertisement

chanakya

ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తున్నారంటే మీరు తప్ప దానికి మరొకరు కారణం కాదు. అలానే చాణక్య చెప్పిన దాని ప్రకారం ఉద్యోగం ప్రారంభించే ముందు మిమ్మల్ని మీరు మూడు ప్రశ్నలు అడగాలి. నేను ఇలా ఎందుకు చేస్తున్నాను, ఫలితం ఏంటి, మరి ఇందులో నేను విజయం సాధిస్తాను ఇటువంటివి ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకుని ఉద్యోగాన్ని మొదలుపెడితే మంచిది. అలానే చాణక్య ఈ ప్రపంచంలో గొప్ప ఆయుధం స్త్రీ యొక్క యవ్వనం, అందం. ఈ రెండు ఎవరినైనా ఏదైనా చేసేలా చేస్తాయని చాణక్య అన్నారు. మీ జీవితం కనుక బాగుండాలి అంటే కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకుని మీరు ఆచరించండి. అప్పుడు జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఏ ఇబ్బంది ఉండదు సంతోషంగా జీవించొచ్చు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading