పవిత్రమైన కార్తీకమాసంలో కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. కొన్ని పద్ధతుల్ని ఫాలో అవ్వడం వలన కార్తీకమాసంలో శివుని అనుగ్రహం కలిగి మంచి జరుగుతుంది, ఏ మాసం కూడా సమానమైనది కాదు, శ్రీమహావిష్ణువుకి సమానమైన దేవుడు కూడా లేడు. వేదములతో సమానమైన శాస్త్రము లేదు. గంగతో సమానమైన తీర్థం కూడా లేదు. అయితే పురాణ కాలం నుంచి ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. హరిహరాతులకు ప్రీతిపాత్రమైన ఈ నెలలో భక్తకోటి యావత్తు కఠిన నిష్టతో నోములు చేస్తూ ఉంటారు. కుజదోషం ఉన్నట్లయితే పెళ్లి ఆలస్యం అవుతుంది అలాంటి వాళ్ళు సుబ్రమణ్య స్తోత్రం ఈ నెల అంతా చదవడం మంచిది.
Advertisement
ఎప్పుడూ ఎదో ఒక అనారోగ్య సమస్య వస్తున్నట్లయితే ఆదిత్య హృదయం పఠించాలి. కంటి సంబంధిత సమస్యలు ఉన్నా ఎంత కష్టపడినా ఎదుగుదల లేకపోతున్నా గరుడ ప్రయోగ మంత్రాలు చదవాలి. వ్యాపారంలో నష్టాలు కుటుంబ కలహాలు అప్పులు అహుగ్రహ దోషాలు ఉన్నట్లయితే మంగళ చండికా స్తోత్రం చదవడం మంచిది. కొత్తగా దీక్ష తీసుకుని ఉపవాసం చేస్తున్న వాళ్ళు చర్మ సమస్యలు ఉన్నవాళ్లు రక్తపోటు ఎక్కువ ఉన్నవాళ్లు షుగర్ ఉన్నవాళ్లు మానసా దేవి స్తోత్రం చదవడం మంచిది. శత్రువు బాధలు ఉన్నా జయం కోరుకుంటున్నా ఇంట్లో పెళ్లి శుభకార్యాలు జరగాలని కోరుకుంటే లలితా సహస్రనామ స్తోత్రం చదవడం మంచిది.
Advertisement
Also read:
కొత్త ఇల్లు కొనాలనుకునే వాళ్ళు మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి. ఉద్యోగం కోరుకునే నిరుద్యోగులు, ప్రమోషన్ కావాలనుకునే వాళ్ళు కనకధార స్తోత్రం పారాయణం చేయడం మంచిది. రాజకీయ నాయకులు, పోలీస్ శాఖ, క్రీడారంగం వాళ్ళు వారాహి కవచం పఠించాలి. అపజయాల భయాలను తగ్గించి కార్యసిద్ధి చేకూరాలంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి కార్తీక మాసం అంతా దీపాలు పెట్టడం తులసి కోట ముందు దీపం పెట్టడం మంచిది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!