స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పార్ట్ 1 ను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని బాషల్లోనూ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ప్రేక్షకులు పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ ను ప్రారంభించారు.
అంతే కాకుండా షూటింగ్ ప్రారంభించిన కొద్దిరోజులకే టీజర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ అత్యధిక వ్యూవ్స్ తో దూసుకుపోతుంది. అంతే కాకుండా పార్ట్ 2 టీజర్ లో ఏదైనా క్లూ దొరుకుతుందా అని విశ్లేషకులు ఎంతో క్షణ్ణంగా పరిశీలించారు. అలా పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు తెలిశాయి. టీజర్ లో పుష్ఫరాజ్ గోరు సరికొత్తగా కనిపిస్తుంది.
కాగా ఆ గోరుతో చైనా లింకులు ఉండబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా పుష్ప 2 నుండి విడుదల చేసిన టీజర్ లో పుష్పరాజ్ ను మంచిపనులు చేసేవాడిగా చూపించారు. చిరు వ్యాపారులకు ఆర్థికసాయం మరియు అనారోగ్యంతో ఉన్నవారికి ఉచిత చికిత్స ఇలా చేయించాడు పుష్ప అని టీజర్ లో చూపించాడు.
అదేవిధంగా పుష్ప ను చూసి పులి కూడా బయపడిపోతుందని టీజర్ లో చూపించాడు. మరోవైపు ఓ లుక్ లో పుష్పరాజ్ చీరకట్టులో మెడలో దండలతో సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నాడు. ఈ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అదేవిధంగా టీజర్ మరియు పోస్టర్ లు చూసిన తరవాత పుష్ప పార్ట్ 2 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను పుష్ప పార్ట్ 2 రీచ్ అవుతుందా లేదా తెలియాలంటే సినిమా విడుదలయ్యేవరకూ వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చదవండి !