Home » చాణక్య నీతి: ఈ ప్రదేశంలో ఉంటే కష్టాలు తప్పవు..!

చాణక్య నీతి: ఈ ప్రదేశంలో ఉంటే కష్టాలు తప్పవు..!

by Sravya
Ad

చాణక్య ఎన్నో విషయాల గురించి ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు భారతదేశ చరిత్రలో గొప్ప తత్వవేత్తల్లో చాణక్య గొప్పవారు. ఎవరైనా జీవితంలో విజయాన్ని సాధించాలంటే చాణక్యుడు సూత్రాలు కచ్చితంగా పాటించాలి ఎందుకంటే చాణక్య నీతి లో ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంది. చాణక్యుడు విధానాల్లో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. చాణక్య నీతి ప్రకారం ఈ ప్రదేశంలో ఉంటే కష్టాలు తప్పవట ఒక వ్యక్తి తనకు గౌరవం లేని ప్రదేశంలో దేశంలో అసలు ఉండకూడదు.

chanakya-niti

Advertisement

అదేవిధంగా జ్ఞానం గుణాలను పొందే అవకాశం లేని ప్రదేశంలో ఉండడం వలన ఎలాంటి ఉపయోగం లేదని చాణక్య అన్నారు. వాస్తవానికి ఏ వ్యక్తి అయినా కూడా ఒకచోట నుండి ఒకచోటికి మారుతూ ఉంటారు కొత్త ఉద్యోగంలో చేరడం కొత్త విషయాలను నేర్చుకోవడం ఇలా అనేక వాటికోసం వెళ్తూ ఉంటారు. కానీ వీటిలో దేనికి అవకాశం లేనప్పుడు అటువంటి దేశాన్ని లేదా ప్రదేశంలో నివసించకూడదు.

Advertisement

Also read:

వేదాలు తెలిసిన బ్రాహ్మణుడు మీరు నివసించే ప్రదేశంలో లేకపోతే ఆ ప్రదేశంలో ఉండకండి. అలానే వైద్యులు లేని ప్రదేశంలో కూడా ఉండకూడదు. ఒక స్నేహితుడు కానీ బంధువు లేదా సహాయకుడు జీవించి ఉండకపోతే విపత్తు సంభవించినప్పుడు మీరు ఎవరు నుండి సహాయం తీసుకోలేరు కనుక అటువంటి చోట కూడా ఉండకండి మంచి విద్య నుండి ప్రవర్తన పిల్లలు భవిష్యత్తుని మెరుగుపరుస్తుంది విద్యాసంస్థలు లేని ప్రదేశంలో పిల్లలు చదవడం అసాధ్యం కాబట్టి అటువంటి చోట కూడా ఉండకండి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading