Home » చాణక్య నీతి: ఈ ఆరుగురికి అస్సలు శత్రువులుగా ఉండకండి… నష్టమే ఉంటుంది…!

చాణక్య నీతి: ఈ ఆరుగురికి అస్సలు శత్రువులుగా ఉండకండి… నష్టమే ఉంటుంది…!

by Sravya
Ad

ఆచార్య చాణక్య ఎన్నో విషయాల గురించి ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన లైఫ్ లో ఎలాంటి నష్టాలు కూడా ఉండవు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు హాయిగా ఉండొచ్చు. చాణక్య ఇటువంటి వాళ్లని శత్రువులుగా చేసుకోవద్దని తట్టుకోలేరని చెప్పారు. ఒక వ్యక్తి రాజుతో లేదంటే ప్రభుత్వంతో ప్రభావం చూపే వాళ్ళతో ఎప్పుడూ కూడా గొడవ పడకూడదు అని అది జీవితానికి ప్రమాదం కాబట్టి అటువంటి వాళ్ళతో అసలు పెట్టుకోకూడదు అన్నారు చాణక్య.

chanakya new

Advertisement

Advertisement

అందరికీ ఆరోగ్యమే గొప్ప సంపద. ఆరోగ్యంతో ఆడుకునేవాడు తన గురించి పట్టించుకోకుండా మృత్యువుని పిలుస్తాడు. ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా డబ్బు వెనక పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు ఆరోగ్యం ఉండదు. ఆహారం ఆరోగ్యం విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మరణమే సంభవిస్తుంది. బలమైన వ్యక్తి తనను తాను బలంగా చేసుకోవడానికి ఎవరికైనా కూడా హాని చేయొచ్చు. ఇటువంటి వ్యక్తితో శత్రుత్వం పెట్టుకోకూడదు. చేతుల ఆయుధం వున్న వ్యక్తితో పోరాడకూడదు. మీ రహస్యాలను తెలిసిన వ్యక్తితో కూడా శత్రుత్వం పెట్టుకోకూడదు. ధనవంతులతో శత్రుత్వాన్ని పెట్టుకోకూడదు. చట్టాన్ని న్యాయాన్ని వక్రీకరించగలరు అని చాణక్య చెప్పారు కాబట్టి ఈ తప్పులను చేయకండి.

Also read:

Visitors Are Also Reading