Home » ఏ దిశలో పూజగది ఉంటే మంచిది..? ఈ తప్పులని మాత్రం అస్సలు చేయకండి.. సమస్యలు వస్తాయి..!

ఏ దిశలో పూజగది ఉంటే మంచిది..? ఈ తప్పులని మాత్రం అస్సలు చేయకండి.. సమస్యలు వస్తాయి..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటిస్తేనే మంచి జరుగుతుంది ఇంట్లో నెగటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాస్తు ప్రకారం పూజగది ఏ దిశలో ఉంటే మంచిది, వాస్తు ప్రకారం పూజగదిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. వీలైనంతవరకు ఈశాన్యంలో కానీ తూర్పు దిశని కానీ ఉత్తరం వైపు కానీ పూజగదిని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే యోగా ధ్యానం పూజ ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలంటే ఈశాన్యం దిక్కున ఎంచుకోండి స్థలం ఎక్కువగా ఉన్నట్లయితే ఇంటి మధ్యలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు.

Advertisement

Advertisement

పూజ గదిని ఎప్పుడూ కూడా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఏర్పాటు చేయాలి. బేస్మెంట్లో చేయకూడదు ఎందుకంటే బేస్మెంట్ లోకి వెలుతురు రాదు. సూర్యుడి కిరణాల వలన లబ్ధి పొందలేరు. ఒకవేళ మీ ఇంట్లో పూజగదికి స్థలం లేకపోతే వంటింట్లో ఈశాన్య దిశన పూజ మందిరాన్ని ఏర్పాటు చేయొచ్చు. అపార్ట్మెంట్లలో ప్రత్యేకించి పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం అవ్వదు కాబట్టి ఇలా వంటగదిలో పెట్టుకోవచ్చు. ఎప్పుడూ కూడా పూజగదికి చోటు లేదని పడకగదిలో మాత్రం పూజ మందిరాన్ని పెట్టుకోవద్దు.

బాత్రూంకి దగ్గరలో కూడా పూజగది ఉండకూడదు చూసుకోండి. గోడకి తగిలించి దేవుడి విగ్రహాలని పెట్టకూడదు కొద్దిగా గ్యాప్ వదిలేసి ఆ తర్వాత మాత్రమే పెట్టండి. పూజ గదిలో డబ్బులు నగలు వంటి విలువైన వస్తువులని పెట్టకూడదు. పూజ గది కప్పు కొద్దిగా కిందకి ఉండేటట్టు చూసుకోవాలి దాని వలన గది కుదురుగా కనపడుతుంది. అలానే పూజ గదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా పూజగది విషయంలో ఈ నియమాలని కచ్చితంగా పాటించండి అప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading