కార్తీకమాసంలో శివుడిని ఆరాధించడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కష్టాల నుంచి బయటపడవచ్చు. అలాగే పరమేశ్వరుడుని ఆరాధించినప్పుడు ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటాం. ప్రదక్షిణలు చేయడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం చేయడం వలన కోరికలు నెరవేరుతాయి. దైవానుగ్రహం మన పైన ఉంటుంది. భక్తులు కూడా దీనిని బలంగా నమ్ముతారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి చూస్తే… కార్తీకమాసంలో శివుడు చుట్టూ ప్రదక్షిణం చేయడానికి ప్రత్యేక పద్ధతి ఉంది.
Advertisement
దాని గురించి వ్యాస మహర్షి తను రచించిన లింగ పురాణంలో వర్ణించారు. శివుడికి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభం ముందు మొక్కి ప్రదక్షిణలు మొదలు పెట్టాలి. ధ్వజస్తంభం నుంచి చండీశ్వరుడు వరకు ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాత మళ్లీ ధ్వజస్తంభం దాకా వెళ్లాలి. అక్కడ క్షణం ఆగి అక్కడి నుంచి శివలింగం అభిషేకం జలం బయటికి వెళ్లే సోమసూత్రం దాకా వెళ్లి మళ్లీ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలి.
Advertisement
Also read:
శివుడికి ఒక ప్రదక్షిణ ఇలా చేస్తే పూర్తవుతుంది. మళ్ళీ వెనక్కి తిరిగి నందీశ్వరుని దర్శించుకుని వస్తేనే ప్రదక్షిణ పూర్తవుతుంది. ఈ విధంగా ప్రదక్షిణ చేస్తే పదివేల ప్రదక్షణలతో సమానమని లింగ పురాణంలో చెప్పబడింది. ప్రదక్షిణ చేసేటప్పుడు పైన చెప్పిన విధంగా ఆచరించి ఎలాంటి తప్పులు చేయకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!