చాలామంది పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుని ఇవి కొనమని అవి కొనమని పేచీ పెడుతూ ఉంటారు. అయితే పిల్లలకి కొన్ని బొమ్మలు కొనకూడదు. ఎటువంటి బొమ్మలతో పిల్లలు ఆడుకోకూడదు..? ఎలాంటి వాటిని కొనుగోలు చేయకూడదు అనేది చూద్దాం. తక్కువకి వచ్చేస్తాయని చాలా మంది తల్లిదండ్రులు చీప్ గా దొరికే ప్లాస్టిక్ బొమ్మల్ని కొంటూ ఉంటారు. అవి తక్కువ ధరకే వచ్చినా పిల్లలకు మంచిది కాదు. ఆ మెటీరియల్ వలన పిల్లలకి అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే తల్లిదండ్రులు పిల్లలకి గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులని ఇస్తారు. కానీ ఇవ్వకూడదు.
Advertisement
కొందరు చాలా ఖరీదైన ట్యాబ్స్ వంటివి పిల్లలకు కొనుగోలు చేసి ఇస్తారు. కానీ వీటి వలన కంటి చూపు దెబ్బ తినడంతో పాటుగా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అలాగే పిల్లలకి ఖరీదైన జ్యువెలరీ అలవాటు చేయకూడదు. పూసలు, బీడ్స్ ఉండే జువెలరీ కూడా పెట్టకూడదు. ఇవి పిల్లలు నోట్లో పెట్టుకుంటే ప్రమాదం. అలాగే పిల్లలకి ఎంత ఏడ్చినా షుగరీ ఫుడ్స్ ని పెట్టకూడదు. కొన్ని రకాల ఆహార పదార్థాలు పిల్లలకు అసలు తల్లిదండ్రులు ఇవ్వకూడదు. షుగర్ ఉండేవి, మైదా ఉండేవి, కూల్ డ్రింక్స్ ఇలాంటివి అస్సలు ఇవ్వకూడదు. వీటి వలన పిల్లలు ఆరోగ్యం పాడవుతుంది.
Advertisement
Also read:
పిల్లలకి చాలా చిన్న వస్తువులు అస్సలు ఇవ్వద్దు. వాటికి దూరంగా ఉంచాలి. అలాగే పదునైన వస్తువులు కూడా పిల్లలకి దూరంగా ఉంచాలి. వాటి వలన కూడా పిల్లలకి ఇబ్బందులు వస్తాయి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని వీడియో గేమ్స్ ఆడటానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. పిల్లలకు వీడియో గేమ్స్ అలవాటు చేయొచ్చు. కానీ హింసను ప్రేరేపించే విడియో గేమ్స్ ని వారికి అలవాటు చేయకూడదు. అలాంటి వాటికి పిల్లల్ని దూరంగా ఉంచాలి. అందరికంటే గొప్పగా కనపడాలని పిల్లలకి ఖరీదైన బట్టలు కొంటూ ఉంటారు అలా కూడా కొనుగోలు చేయకూడదు. పిల్లలకి కంఫర్ట్ లేని బట్టలు వేయకూడదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!