Home » ఈ టాప్ 5 మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కొక్క సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా..?

ఈ టాప్ 5 మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కొక్క సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా..?

by Mounika
Ad

 ఒక సినిమా సక్సెస్ కావాలి అంటే సంగీత దర్శకుల పనితనం కూడా చాలా అవసరం. ఓ సినిమా సక్సెస్ అవ్వాలి అంటే కేవలం కథ ఉంటేనే సరిపోదు దానికి తగ్గ సంగీతం ఉన్నప్పుడు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకోని ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.   టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కోసారి సినిమా కథ ప్లాప్ అయినా  ఆ చిత్రానికి సంబంధించి పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని భారీ విజయాలు సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఏ సినిమాకైనా పాటలు కీలకపాత్ర పోషిస్తాయి.   అందుకే చిత్రబృందం సంగీత దర్శకుని ఎంచుకునే విధానంలో కూడా ఆచితూచి అడుగు వేస్తారు. తమ సినిమాలకు సంగీతాన్ని అందించే మ్యూజిక్ డైరెక్టర్ కి ఎంత అడిగినా ఇవ్వడానికి కూడా వెనకాడరు.  ఇప్పుడు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసుకుందాం.

Advertisement

#1 ఏఆర్ రెహమాన్ :

 ఏఆర్ రెహమాన్ ఆయన సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఏఆర్ రెహమాన్ ఒక సినిమా బడ్జెట్ ఆధారంగా దాదాపు 8 నుంచి 10 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటారు.

 

#2 అనిరుధ్ రవి చందర్ :

 అనిరుధ్ సంగీతం అంటే ఆ సినిమాలో పాటలు నెక్స్ట్ లెవల్ ఉంటాయి. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మ్యూజికల్ గా హిట్స్ అవ్వాల్సిందే. అనిరుధ్ కూడా  సినిమా బడ్జెట్ ఆధారంగా 5  కోట్లకు పైగా వసూలు చేస్తాడు.

Advertisement

#3. ఎం ఎం కీరవాణి  :

రెహమాన్ తర్వాత సౌత్ నుంచి మళ్లీ అలాంటి క్యాలిబర్ ఉన్నా సంగీత దర్శకుడు ఎవరైన ఉన్నారు అంటే అది మన కీరవాణి మాత్రమే. బాహుబలి, RRR లాంటి పెద్ద సినిమాలతో పాటు పెళ్లి సందD లాంటి చిన్న సినిమాలకు సైతం హిట్ ఆల్బమ్స్ ఇవ్వగలరు.  ఎంఎం కీరవాణి  ఒక్కో సినిమాకు  ఐదు కోట్ల రూపాయల  వరకు వసూలు చేస్తారు.

#4 దేవి శ్రీ ప్రసాద్ :

devisriprasad

ఇక అందరూ డీఎస్పీ పని అయిపోయింది అని అనుకుంటున్న టైమ్ లో పుష్ప లాంటి మాస్ ఆల్బమ్ తో పాన్-ఇండియా కమ్ బ్యాక్ ఇచ్చాడు డీఎస్పీ.  ప్రస్తుతం డిఎస్పి ఒక సినిమా గాను మూడు నుంచి ఐదు కోట్ల రూపాయల  వరకు వసూలు చేస్తారు.

 

#5 థమన్ :

ఇక సౌత్ ఇండియాలో ఎప్పుడు ఎక్కువగా వినిపించే పేరు  SS థమన్. థమన్ దగ్గరికి వచ్చే సినిమా ఆఫర్లు బట్టి వాళ్లకి రిబేట్ కూడా ఇస్తూ ఉంటాడు. అందుకే ఇతను అందరికీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్ట్ గా పేరు పొందాడు. ఈయన ఒక సినిమాకు గాను మూడు నుంచి ఐదు కోట్ల రూపాయలను వసూలు చేస్తాడు.

 

Visitors Are Also Reading