Home » షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లకు వెళ్ళే కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై క్యారీబ్యాగ్ లు ఫ్రీ

షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లకు వెళ్ళే కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై క్యారీబ్యాగ్ లు ఫ్రీ

by Bunty
Ad

సాధారణంగా పెద్ద షాపింగ్ మాల్స్  కు వెళ్లే కస్టమర్లకు  క్యారీబ్యాగ్ విషయంలో సమస్య ఎదురవుతోంది. క్యారీ బ్యాగ్ తీసుకెళ్ల పోతే ఐదు నుంచి పది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వేలకు వేలు పెట్టి సరుకులు కొనేటప్పుడు క్యారీ బ్యాగులు ఉచితంగా ఇవ్వమని కస్టమర్లు అడుగుతే షాపింగ్ మాల్ నిర్వాహకులు ససేమిరా అంటారు. ఈ విషయంపై హైదరాబాదు తార్నాక కు చెందిన ఆకాష్ కుమార్ వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశాడు.

Advertisement

Advertisement

వివరాల్లోకి వెళితే 2019 మే 11 హైదరాబాదులోని డీ మార్ట్ కే ఆకాష్ కుమార్ సరుకులు కొన్నాడు బిల్లు 602 రూపాయలు అవ్వడంతో డీమార్ట్ వాళ్లను క్యారీ బ్యాగ్ అడగగా రూ.3.50 చార్జీ వసూలు చేశారు. క్యారీబ్యాగ్ పై డి మార్ట్ పేరు ముద్రించి చార్జీలు వసూలు చేయడంపై బాధితుడు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు.దీంతో కమిషన్ నోటీసులు జారీ చేయడంతో డి మార్ట్ సంస్థ స్పందించింది.

సదరు వినియోగదారులు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని కమిషన్కు డి మార్ట్ వివరణ ఇచ్చింది. కస్టమర్లు తెచ్చుకున్న క్యారీ బ్యాగులు అనుమతిస్తున్నట్లు వివరణలో సంస్థ పేర్కొంది. క్యారీబ్యాగ్ తీసుకోవాలా? వద్దా? అనేది కస్టమర్ల ఇష్టం అనే స్పష్టం చేసింది. అయితే డీమార్ట్ వాదనను వినియోగదారుల బెంచ్ తోసిపుచ్చింది.అయితే క్యారీబ్యాగ్ పై ప్రింటు చేసిన లోగో చేసిన ఇవ్వకపోయినా వినియోగదారులకు ఉచితంగా ఇవ్వాలని వినియోగదారుల ఫోరం డి మార్ట్ న ఆదేశించింది.

Visitors Are Also Reading