ఒకప్పుడు పెళ్లి చేసుకున్న తరవాత జీవితాంతం వారితోనే కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. నచ్చకపోతే విడాకులు తీసుకుని ఎవరి జీవితం వాళ్లు చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కూడా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నవాళ్లు ఎక్కువ మంది కలిసి ఉంటుండగా ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలు ఎక్కువగా విడాకులు తీసుకుంటన్నట్టు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే ప్రేమ వివాహం చేసుకున్న జంటలు ఎక్కువగా విడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయన మానసిక నిపుణులు చెబుతున్నారు.
Advertisement
అవేంటో ఇప్పుడు చూద్దాం….పెళ్లికి ముందు ఒకరిపై మరొకరు అమితమైన ప్రేమ చూపించుకోవడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. అయితే ఆ ప్రేమ పెళ్లి తరవాత ఉండటం లేదని అందువల్లే ప్రేమ వివాహం చేసుకున్నవారు ఎక్కువ సంఖ్యలో విడిపోతున్నారని చెబుతున్నారు. అదే విధంగా పెద్దలు కుదిర్చిన వివాహం అయితే ఏదైనా కష్టం వస్తే ఆదుకునేందుకు ఇరు కుంటుంబాల పెద్దలు వస్తారు.
Advertisement
కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నవారికి సమస్య వస్తే వారే పరిష్కరించుకోవాలి. ఆ కష్టాలను భరించలేక కూడా కొంతమంది ఫ్రస్టేషన్ తో గొడవలు పెట్టుకుని విడిపోతున్నారని చెబుతున్నారు. అంతే కాకుండా ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు వాళ్ల తల్లిదండ్రుల పెద్దలు పంచాయితీ ఏర్పాటు చేసి మళ్లీ కలిపే ప్రయత్నం చేస్తారు.
కానీ ప్రేమ వివాహం చేసుకున్నవాళ్లను కలిపేందుకు పెద్దలు ముందుకు రావడం లేదు. ఇక పెళ్లికి ముందు అబద్దాలు చెప్పి మోసం చేసే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి ప్రేమ జంటలు కూడా పెళ్లి తరవాత అవన్నీ అబద్దాలని తెలుసుకుని విడిపోతున్నట్టు మానసిక నిపుణులు చెబుతున్నారు.