Home » పెళ్ళైన కొన్ని దశాబ్దాల తరువాత కూడా విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు?

పెళ్ళైన కొన్ని దశాబ్దాల తరువాత కూడా విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు?

by Srilakshmi Bharathi
Ad

భారత దేశంలో వివాహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 1.1 శాతంతో ప్రపంచంలోనే అతి తక్కువ విడాకుల రేటు కలిగి ఉన్న దేశంగా భారత దేశం ఉండడం గర్వకారణమే. కానీ, ఇటీవల కాలంలో విడాకుల కేసులు ఎక్కువ అవుతుండడం ఆందోళన కలిగించే విషయం. అయితే.. ఇటీవల రెండు దశాబ్దాలకు పైగా కలిసి ఉన్న జంటలు కూడా విడిపోవడానికి సిద్ధం అవుతుండడం మరింత ఆందోళన కలిగించే విషయమే. వివాహాన్ని, సనాతన ధర్మాలను ఎక్కువగా పాటించే భారత దేశంలోనే ఇలా జరుగుతుండడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబంలో ఉండే పెద్దవారు జీవిత భాగస్వామికి అండగా నిలబడేవారు. ఇది కొత్తగా పెళ్ళైన జంటకు వచ్చే సమస్యల్ని ఎదుర్కోవడంలో తోడ్పాటుగా ఉండేది. ఇపుడు చిన్న కుటుంబాలు అవుతుండడంతో వైవాహిక బంధాన్ని కొనసాగిస్తూ వ్యక్తిగత అవసరాలను తీర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి జంటలు ఎక్కువ ఒత్తిడి అనుభవిస్తున్నారు. దీనితో త్వరగా విడాకులకు మొగ్గు చూపుతున్నారు. ఇక పెళ్ళై రెండు దశాబ్దాలు దాటిన తరువాత, పిల్లలు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాక పెద్దలిద్దరు మిగులుతారు. వారిలో ఉండే ఒంటరితనం బయటకు ఇస్తుంది. ఇద్దరు ఒకరినొకరు కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన తరుణంలో.. అప్పటికే ఒకరిపై ఒకరికి ఏర్పడిన అభిప్రాయాల కారణంగా దూరం పెట్టుకుంటూ ఉంటారు.

Advertisement

స్వతంత్రంగా తిరగాలని ఉండడం, అభిప్రాయం బేధాలు ఉండడం వలన కూడా ఇన్ని సంవత్సరాలు కలిసున్నాక.. ఇప్పటికైనా విడిపోయి సుఖంగా ఉండాలన్న ఆలోచనలు వస్తుంటాయి. ఆధునిక వైద్య ప్రమాణాల ద్వారా ఆయుర్దాయం పెరుగుతుండడంతో.. జీవితాన్ని సొంతంగా అనుభవించాలి.. అనే ఆశలు మొదలై విడాకులకు వెళ్లాలని అనుకుంటుంటారు. సమయానుసారం బంధాలను మెరుగుదిద్దుకోకపోతే..అవి మరుగున పడతాయని మానసిక శాస్త్రవేత్తలు కూడా చెబుతుంటారు. ఇంకా కొందరు అవిశ్వాసం కారణంగా కూడా విడాకులు తీసుకోవాలని అనుకుంటారు. ఏళ్ళు గడిచే కొద్దీ జీవితంలో ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. విడిపోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఇది కూడా ఓ కారణం. ఇద్దరి మధ్య వ్యత్యాసాలు ఉండడం సహజం. అయితే.. వాటికీ సర్దుకుపోవాలి తప్ప పరిష్కరించాలని అనుకోకూడదు. ఎందుకంటే కొన్నిటిని పరిష్కరించడం సాధ్యం కాదు. సర్దుకుపోలేనప్పుడు విడాకుల వైపు గాలి మళ్లుతుంది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading