క్రికెట్ లో అతి పెద్ద ధనిక బోర్డు బీసీసీఐ. అందుకే ఐసీసీ కూడా బీసీసీఐకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇకపోతే ప్రతి ఏడాది బీసీసీఐ ఆదాయం డబుల్ గా పెరుగుతుంది. టీమిండియా ఆడే మ్యాచ్ లతో పాటు ఐపీఎల్ వల్ల బీసీసీఐకి ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ప్రపంచ స్థాయి కంపెనీలు బీసీసీఐతో కలిసి పని చేయడానికి కోట్లతో డీలింగ్ చేస్తారు. ఇక గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బీసీసీఐ ఆదాయం మరింత పెరిగింది. 2021-22లో బీసీసీఐ ఆదాయం 4360.57 కోట్లు ఉండగా, 2022-23లో 6,58.80 కోట్లకు చేరింది.
Advertisement
ఈ విషయాన్ని బీసీసీఐ ట్రెజరర్ ఆశిష్ శేలార్ ప్రకటించారు. గోవాలో జరిగిన బీసీసీఐ 92వ వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీi ఆదాయ వివరాలు తెలిపారు. ఇక ఈశాన్య రాష్ట్రాలలో క్రికెట్ ను మరింత అభివృద్ధి చేయడానికి 12.5 కోట్లు, అలాగే పుదుచ్చేరికి ఏటా 17.5 కోట్లు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. ఇక బీసీసీఐ ఆదాయం డిజిటల్ హక్కులు, స్పాన్సర్స్ షిప్ ద్వారా ఎక్కువగా వస్తుంది. ఇక వచ్చే నెల నుండి వన్డే వరల్డ్ కప్ జరగనుంది.
Advertisement
దాంతో ఈ ఆదాయం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈసారి ఇండియాలో మెగాటోర్నీని బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దాంతో టీమ్ ఇండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నిలో టీమిండియా ఛాంపియన్ గా నిలిస్తే బీసీసీఐ బ్రాండ్ వాల్యూ మరింతగా పెరిగి ఆదాయం డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా వరల్డ్ కప్ కు సిద్ధమైంది. గిల్, కోహ్లీ, రోహిత్, కె ఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లు ఫామ్ లో ఉండడంతో భారతజట్టు విశ్వవిజేత అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి వారి ఆశలను టీమ్ ఇండియా నెరవేరుస్తారా లేదా అన్నది చూడాలి.
ఇవి కూడా చదవండి
- జూనియర్ ఎన్టీఆర్ కు తల్లిగా ప్రియమణి.. అసహనంలో ఫ్యాన్స్!
- Pooja Hegde : తెలుగు ఇండస్ట్రీకి పూజా హెగ్డే గుడ్ బై..?
- Virat Kohli : విరాట్ కోహ్లి రిటైర్మెంట్.. షాక్ లో ఫ్యాన్స్ ?