సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్రలేవగానే టీ తాగనిదే చాలా మందికి రోజు గడవదు. కప్పు చాయ్ కడుపులో పడగానే చాలా మందికి ఉత్తేజాన్ని ఇస్తుంది. శరీరంలో చల్లదనం ఎక్కువైనప్పుడు వేడి కోసం గరం గరం చాయ్ తాగాల్సిందే. చాలా మందికి ఒత్తిడి కారణంగా ప్రతీ రోజు టీ తాగే అలవాటు ఉంటుంది. బెడ్ కాఫీ తాగడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా ఉదయం టీ తాగే అలవాటు తప్పకుండా ఉంటుంది. కొంత మంది నిద్రలేవగానే టీ లేదా కాఫీని తాగడం వల్ల ఆ రోజును ఫ్రెష్ గా ప్రారంభించే వీలు ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. టీ తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. అంతేకాదు.. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం. మీరు టీ ప్రియులు అయితే ఖాలీ కడుపుతో టీ తాగడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవడం ఉత్తమం.
Also Read : ‘బలగం’ సినిమాలో కొమురయ్య చిన్న కొడుకు చక్రవాకం సీరియల్ నటించాడని తెలుసా ?
Advertisement
ఉదయం నిద్ర లేవగానే ఏమి తీసుకోకుండా కేవలం టీ తాగడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. క్రమంగా ఇవి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దారి తీస్తాయి. అవసరం ఉన్నంతవరకు మాత్రమే తాగాలి. అతిగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. మరీ ముఖ్యంగా పరగడుపున కప్పు టీ తాగిన పలు వ్యాధులకు గురవుతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకు అంటే టీ లేదా కాఫీలో ఆమ్లం అనే పదార్థం ఉంటుంది. సహజంగానే మన శరీరంలో ఉంటుంది. పరగడుపున టీ తాగడం వల్ల దీని పరిమాణం పెరిగి ఎసిడిటికి దారి తీస్తుంది. అంతేకాదు.. నోటిలోని బ్యాక్టీరియా షుగర్ లెవల్స్ ని పెంచుతుంది.
Advertisement
ఖాళీ కడుపుతో టీ తాగితే డీ హైడ్రేషన్ కి కూడా గురయ్యే అవకాశముంది అని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. టీలో ఉండే పదార్థాలు శరీరంలో మూత్రస్థాయిని కూడా పెంచుతాయి. దీనివల్ల శరీరంలోని నీరు అంతా బయటికీ పోతుంది. అదేవిధంగా ఇది నిర్జిలీకరణ సమస్యకి దారి తీస్తుంది. అంతేకాదు.. పరిగడుపున టీ తాగితే జీర్ణక్రియ క్షీణిస్తుంది. జీర్ణవ్యవస్థ దెబ్బతినడం వల్ల శరీరంలో శక్తి నశించిపోతుంది. దీంతో ఎల్లప్పుడూ అలిసిపోయినట్టు కనిపిస్తారు. ఆ తరువాత జ్వరం, తదితర వ్యాధులు వచ్చే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. టీ ఎక్కువగా తాగడం వల్ల మలబద్ధకం లాంటి సమస్య కూడా ఏర్పడుతుంది. అంతేకాదు.. నిద్రలేమి సమస్య బరువు పెరగడం, ఆకలి మందగించడం, రక్తపోటు సమస్యలు వస్తాయి. మొత్తానికి టీని దూరం చేయకుండా మోతాదుకు మించి తీసుకోకపోవడమే మంచిది. అదేవిధంగా కేవలం టీ కాకుండా టీ తో పాటు బిస్కీట్లు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
Also Read : టబుతో కలిసి నిత్యామీనన్ నటించిన సినిమా ఏదో మీకు తెలుసా ?