మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్రపరిశ్రమ గర్వించదగ్గ నటుడు. సాధారణ కానిస్టేబుల్ కుమారుడుగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి నటనపై ఉన్న ప్రేమతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఎంతో కష్టపడి సినిమాల్లోకి వచ్చాడు. మొదట విలన్ గా ఇతర పాత్రలు చేసి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తరవాత హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ లు అందుకున్నాడు. ఇక చిరు తన కెరీర్ లో ఎంతో మంది దర్శకులకు లైఫ్ ఇచ్చాడు. చిరుతో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకునే దర్శకులు చాలా మంది ఉన్నారు.
అయితే చిరంజీవికి రీఎంట్రీ తరవాత మాత్రం సరైన హిట్ పడలేదనే చెప్పాలి. అంతే కాకుండా ముగ్గురు స్టార్ డైరెక్టర్ లతో సినిమాలు చేస్తే ఆ ముగ్గురూ కూడా చిరంజీవితో సినిమా చేసి కెరీర్ ను కోల్పోయారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు వివి. వినాయక్ దర్శకత్వం వహించారు. అయితే వివి వినాయక్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు.
Advertisement
Advertisement
కానీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు. ఆ తరవాత వినాయక్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. అంతే కాకుండా చిరంజీవితో మరో స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి సైరా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ మాత్రం కవర్ అవ్వలేదు. ఎక్కువ బడ్జెట్ పెట్టిన ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసినప్పటికీ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.
అంతే కాకుండా రీసెంట్ గా చిరంజీవి ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి వరకూ కొరటాలకు ఒక్క ఫ్లాప్ కూడా లేకపోవడంతో ఆచార్య పక్కా హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అసలు కొరటాలనే ఈ సినిమా తీశాడా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. ఈ సినిమా తరవాత కొరటాలతో సినిమా చేయాలంటేనే హీరోలు బయపడుతున్నారు.