తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శనివారం అరెస్టు చేయగా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడును రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలుకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేతపై కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయి.
Advertisement
అయితే చంద్రబాబు నాయుడు అరెస్టుపై కొంతమంది మద్దతు పలకగా.. మరి కొంతమంది ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడున్ని అరెస్టు చేయడం పై తప్పు పడుతున్నారు. ఈ విషయంపై అనేకమంది రాజకీయ మరియు సినీ ప్రముఖులు సైతం చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తున్నారు.
చంద్రబాబు అరెస్టును తప్పుపడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకుని మరి నిరసన తెలిపారు. అంతేకాకుండా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పవన్ వ్యవహారశైలిపై అనేక విమర్శలు వ్యక్తం అయిన నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 9 ప్రశ్నలను పవన్ కళ్యాణ్ కి సంధించడం జరిగింది. అంతేకాకుండా ఆ 9 ప్రశ్నలకు సింగిల్ వర్డ్లో సమాధానం చెప్పాలని వర్మ, పవన్ కళ్యాణ్ ని కోరారు.
1.అసలు స్కిల్ స్కామ్ జరిగిందా..? లేదా ?
2.ఒకవేళ జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జరిగిందా..?
Advertisement
3.రూ 300 కోట్లు పైగా ప్రజాధనాన్ని ప్రొసీజర్స్ ఫాలో అవకుండా, ఆఫీసర్స్ చెబుతున్న వినకుండా రిలీజ్ చేశారా..? లేదా..?
4.ఒకవేళ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ సీబీఎన్ గారికి స్కాం గురించి తర్వాత తెలిసుంటే, దానిమీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోకపోవడం కరెక్టా..?
5.ఎఫ్.ఐ.ఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే. ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎప్పుడైనా ఎవరి పేరు అయినా యాడ్ చేయవచ్చు అన్న విషయం మీకు తెలియదా..?
6.చూపించిన డాక్యుమెంట్స్ బట్టి క్రైమ్ చేసినట్లు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉందని నమ్మిన జడ్జిగారు బెయిల్ ఇవ్వకపోవడం తప్పా..?
7.సెక్షన్ 409 అప్లై అవుతుందని రిమాండ్ గ్రాండ్ చేసిన జడ్జిగారు కరెప్టా.?
8. లీడర్స్ వాళ్ళ నలభై ఏళ్ల బ్యాక్ గ్రౌండ్ బట్టి కాదు, వాళ్ళు చేసే పనులు బట్టి అనే విషయం మీకు తెలియదా.. ?
9.నా తొమ్మిదవ చివరి ప్రశ్న. అసలు స్కిల్ స్కాం కేసు మీకు అర్థమైందా..? దానిలోని తప్పులేంటో ఒక వీడియోలో కెమెరా వంక చూస్తూ వివరించగలరా..? థ్యాంక్యూ అండి అంటూ రాంగోపాల్ వర్మ ట్వీటర్ ద్వారా పవన్ కళ్యాణ్ ని క్వశ్చన్ చేశారు. మరి రాంగోపాల్ వర్మ అడిగినప్పుడు ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడవలసిందే..
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ చదవండి !