పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో నటించనున్నారు. రామాయణంలో కీలక పాత్ర అయినటువంటి రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ బాహుబలి సినిమా నుంచి పాన్ ఇండియా హీరోగా మారాడు. ఏ సినిమా విడుదలైన పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కావడం విశేషం.
Also Read : ఫిల్మ్ ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాద్ ఎలా వచ్చిందో తెలుసా…ఏఎన్ఆర్ ఏం చేశారంటే..?
Advertisement
దసరా వేడుకల్లో భాగంగా ఆదిపురుష్ టీజర్‌ని విడుదల చేసిన విషయం విధితమే. దేశవ్యాప్తంగా ఈ టీజర్ పై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీజర్‌లో ప్రభాస్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్ లుక్ పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ తప్పులను సరి చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది. ఈ సినిమా వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు దర్శకుడు ఓంరౌత్.
Advertisement
నిజానికి జనవరి 12, 2023 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తామని ప్రకించారు. కానీ టీజర్ పై తీవ్ర విమర్శలు వినిపించిన తరుణంలో వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్ కోసం మరో 100 కోట్లను అదనంగా ఖర్చు చేయబోతుంది ఆదిపురుష్ టీమ్. తాజాగా ఆదిపురుష్ సినిమాను జూన్ 16, 2023న విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు ఓంరౌత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమా వాయిదా పడడంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశ చెందుతూ తమదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.